ఈట‌ల‌ను బండి సంజ‌య్ ఇంత లైట్ తీస్కొన్నాడా ?

VUYYURU SUBHASH

ఈట‌ల రాజేంద‌ర్ తెలంగాణ రాజ‌కీయాల్లో రెండున్న‌ర ద‌శాబ్దాలుగా కీల‌క నేత‌గా ఎదుగు తూ వ‌స్తున్నారు. కేసీఆర్ టీఆర్ ఎస్ స్థాపించ‌న ప్ప‌టి నుంచే ఆయ‌న వెంట ఉంటూ వ‌స్తోన్న ఈట‌ల ఇప్ప‌టికే ఆరు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. అస‌లు ఈట‌ల‌కు ఓట‌మి అన్న మాటే తెలియ‌దు. ఇక ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక ఆయ‌న కేసీఆర్ తొలి కేబినెట్లో నే మంత్రి అయ్యారు. ఇక కేసీఆర్ తెలంగాణ కు రెండో సారి ముఖ్య‌మంత్రి అయ్యాక కూడా ఆయ‌న‌కు మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. త‌ర్వాత ఈట‌ల వ‌ర్సెస్ కేసీఆర్ మ‌ధ్య తీవ్రమైన గ్యాప్ రావ‌డం తో కేసీఆర్ చాలా అవ‌మాన క‌ర రీతితో ఈట‌ల‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారు.
త‌ర్వాత ఆయ‌న టీఆర్ ఎస్ కు రాజీనామా చేసి మ‌రీ బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిల్లోనూ ఈట‌ల బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ లోకి ఈట‌ల వెళ్ల‌డం ఆ పార్టీకి ఎంతైనా బూస్ట‌ప్ లాంటిదే. అయితే ఈట‌ల లాంటి నేత‌కు ఇప్పుడు బీజేపీలో ప్రాధాన్య‌త త‌గ్గి పోయిందా ? ఆయ‌న అక్క‌డ గెలిస్తే ఎక్క‌డ ఆయ‌న‌కు అధిష్టానం వ‌ద్ద క్రేజ్ పెరిగి.. త‌మ‌ను ప‌ట్టించు కోవ‌డం మానేస్తారో ? అని ఆయ‌న విజ‌యం కోసం ప‌ని చేయ‌డం లేదా ? ఆయ‌న ను పట్టించుకోవడం మానేశారా అంటే అవుననే చ‌ర్చ‌లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఈట‌ల నామినేష‌న్ వేసిన‌ప్పుడు హ‌డావిడి చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు మళ్లీ కనిపించలేద‌ట‌. తర్వాత నవరాత్రి దీక్ష చేసిన బండి సంజయ్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇక పార్టీ ప‌రంగా కూడా ఈట‌ల‌కు పెద్ద‌గా స‌హాయ స‌హ‌కారాలు లేవ‌ని అంటున్నారు. అక్క‌డ ఉప ఎన్నిక కోసం పార్టీ త‌ర‌పున నియ‌మించిన ఇన్ చార్జ్ లు సైతం పండ గ పేరుతో హుజూరా బాద్‌ను వీడి వెళ్లారు. వారు కూడా మ‌ళ్లీ అక్క‌డ కు రాలేద‌ట‌.
ఏదేమైనా దుబ్బాక ఉప ఎన్నిక‌ను బీజేపీ చాలా క‌సి గా తీసుకుంది. ఆ క‌సి ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల్లో హుజూరా బాద్ లో లేద‌నే అంటున్నారు. మ‌రో వైపు ప్రచార గడువు పట్టుమని పది రోజులు కూడా లేదు.. అయినా కూడా ఈ టైంలో ప్ర‌చారం స్లో అయిపోవ‌డం ఈట‌ల గ్యాంగ్ కు మింగుడు ప‌డ‌డం లేదు. ఇలాంటి టైంలో బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లడం ఈటల వర్గీయుల్ని తీవ్ర నిరాశ‌కు గురి చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: