బ్రేకింగ్: కేసీఆర్ అర్జెంట్ మీటింగ్, కారణం ఏంటీ...?

Sahithya
రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై ఎక్కువగా విమర్శలు రావడంతో ప్రతీ ఒక్క పోలీస్ అధికారిని కూడా అలెర్ట్ చేస్తున్నారు. ఇక ఏపీలో ఈ డ్రగ్స్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. నిన్న టీడీపీ నేత పట్టాభి డ్రగ్స్ విషయంలో చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇక తెలంగాణాలో కూడా డ్రగ్స్ పెరగడంతో ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో  మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేస్తున్నారు ఆయన. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు, పోలీస్ శాఖను ఆధునీకరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటి వాటిపై చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సిఎం కేసిఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సమావేశానికి హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, డిజీపి మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు, ఐజిలు, డిఐజిలు, అడీషినల్ డిజి లా అండ్ ఆర్డర్, ఇంటలిజెన్స్ అడీషినల్ డిజి, జిల్లాల ఎస్పీలు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా సూపరింటెండెంట్లు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరు అవుతున్నారు అని తెలుస్తుంది. జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు తమ జిల్లాల పరిధిలో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో రావాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అలాగే గంజాయి మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: