టీడీపీ పాపం నాకెందుకు.. ప‌వ‌న్ భ‌లే దెబ్బేశాడుగా...!

VUYYURU SUBHASH
పీలో టీడీపీ కార్యాల‌యాల‌పై వ‌రుస‌గా దాడులు జ‌రిగాయి. అయితే ఈ దాడుల ను టీడీపీ వాళ్లు మామూలుగానే ఖండిస్తున్నారు. అయితే ఈ దాడుల‌ను ఖండించే విష‌యంలో బీజేపీ నేరుగానే కౌంట‌ర్లు ఇచ్చింది. వైసీపీ గుండాగాళ్ల దాడులు అని సెటైర్లు వేసింది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం చాలా తెలివిగానే త‌ప్పించుకున్న‌ట్టు ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మైంది. ఆయ‌న ఎక్క‌డా నేరుగా విమ‌ర్శ‌లు చేయ‌కుండా.. ప‌రోక్ష‌మైన విమ‌ర్శ‌లు చేశారు. ఇక ఈ దాడి చేయ‌డం త‌ప్ప‌న్న‌ది తెలిసిందే. అయితే టీడీపీ నేతలు నోరు జారడం వల్లే ఈ పరిణామాలన్నీ జరిగాయ‌న్న విష‌యం ప‌వ‌న్ కు కూడా తెలుసు.

అందుకే ప‌వ‌న్ పూర్తిగా టీడీపీ త‌రపున వ‌క‌ల్తా పుచ్చుకోలేదు. ముఖ్య‌మంత్రిని మ‌రీ దారుణంగా దిగ‌జారి తిట్ట‌డం చాలా మందికి న‌చ్చ‌లేదు. అందుకే ప‌వ‌న్ కూడా ఈ విష‌యం లో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేసి సరిపెట్టుకున్నారు. టీడీపీ నేత‌ల తిట్ల పాపాన్ని త‌న నెత్తిన వేసుకోవాల‌ని అనుకోలేదు.. అలాగే వాటిని స‌మ‌ర్థించాల‌ని కూడా అనుకోలేదు.

అయితే టీడీపీ వాళ్లు మాత్రం మ‌రోలా ఆలోచ‌న చేశారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల కు తోడు జ‌న సైనికులు కూడా తోడు అయితే ఏపీలో ఈ రోజు బంద్ పేరుతో రచ్చ రంబోలా షురూ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే ప‌వ‌న్ ఎక్క‌డా బంద్ ప్రస్తావన తీసుకురాలేదు.. స‌రిక‌దా.. బంద్‌కు తాము స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు కూడా చెప్ప‌లేదు. ఇటీవల స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీ - జనసేన కలసిపోయాయ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తాము కలిసే పోటీ చేస్తామంటూ టీడీపీ వాళ్లు ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటున్నారు.

అయితే ఇప్పుడు టీడీపీ ఆఫీసుల‌పై దాడులు జ‌రిగి.. టీడీపీ ఇంత ప్ర‌తిష్టాత్మ‌కం గా బంద్‌కు పిలుపు ఇచ్చినా కూడా ప‌వ‌న్ లైట్ తీస్కోవ‌డం టీడీపీ శ్రేణుల‌కు ఎంత మాత్రం రుచించ‌డం లేదు. అందుకే ఈ రోజు టీడీపీ చేప‌ట్టిన బంద్ కూడా నీర‌సంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: