ఈశాన్య రాష్ట్రాలపై.. చైనాకు అందుకే ప్రేమ..!

Chandrasekhar Reddy
అందమైన కొండలతో ఆకర్షణీయంగా ఉండటమే ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేకత. అలాంటిది ఉండటం అందానికే తప్ప పెద్దగా ఆస్తిని చేకూర్చగల ప్రాంతం కాదు. అందుకే అక్కడ ప్రత్యేక హోదా లాంటివి ఇవ్వడం, కేంద్ర సంపాదనలో దానికి కొంత బడ్జెట్ కేటాయించడం లాంటివి జరుగుతుంటాయి. దీని ద్వారా అక్కడ ప్రశాంతత నెలకొనడమే కాకుండా, తద్వారా భారత్ కు రక్షణ కూడా మెరుగ్గా ఉంటుంది. ఉదాహరణకు వంద అంతస్తులో ఉన్నవాడు కిందవాళ్లు ఎక్కడెక్కడ ఉన్నది కనిపెట్టి మట్టుపెట్టగలడు, కానీ రెండో అంతస్తులో ఉన్నవాడు వందవ అంతస్తులో ఉన్నవాడిని కొట్టడం అసాధ్యం. అందుకే అరుణాచలప్రదేశ్ పై చైనా కన్నేస్తుంది.  దానిని ఎలాగైనా ఆక్రమించుకుంటే భారత్ ను నిలువరించడం సాధ్యం అటువుందని ఆ దేశం వ్యూహం.
భారత్ కు ఈ వ్యూహం తెలుసు కాబట్టి అరుణాచలప్రదేశ్ అయితేనేమి కాశ్మీర్ అయితేనేమి కాపాడుకుంటూ వస్తుంది. అవి రెండు కొండప్రాంతాలు కావడం చేత ఆయా దేశాలు వాటిని కబళించి భారత్ పై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న భారత్ కూడా తనకు బలమైన శక్తిగా ఉన్న ఇలాంటి ప్రాంతాలను మొదటి నుండి కాపాడుకుంటూ వస్తుంది. అయితే చైనా పాక్ లు మాత్రం వాటిని ఎప్పుడెప్పుడు కబలిద్దామా అని వేచి చూస్తున్నాయి. అందుకు అప్పుడప్పుడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు భారత్ వారిని నిలువరిస్తూనే ఉంది.
భారత్ ఈ రెండు ఈశాన్య రాష్ట్రాలలో ప్రత్యేక దళాలను మోహరించింది. సాధారణ పరిస్థితులలో ఇవి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కానీ ఈ రెండు దేశాలు చేస్తున్న ప్రయత్నాల వలన ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయాందోళనలతో అక్కడ పెద్దగా పర్యాటకులను అనుమతి ఇవ్వడం లేదు. తాజాగా చైనా అరుణాచలప్రదేశ్ గురించి చేసిన వ్యాఖ్యలతో భారత్ మరింత జాగర్త వహిస్తూ ఆ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ప్రత్యేక దళాలను మోహరించింది. ఇలా ఇవి ఎప్పటికి పహారా మధ్య పర్యాటకులు నోచుకోలేని ప్రాంతాలుగా ఉండిపోతున్నాయి. ఇది కూడా ఆ రెండు దేశాలు చూసి సంతోషపడతాయి, కారణం భారత్ కు కాస్త పర్యాటక ఆదాయం తగ్గించినందుకు. అది ఆదేశాల మానసిక స్థితి. భారత్ వాటికీ చేసిన అంత అన్యాయం ఏమిటో మరి! కుళ్లు మనసులో పేరుకుపోయిన వారికి పెద్దగా అన్యాయాలు చేయాల్సిన పనిలేదు, పక్కవాడు బాగుంటే కూడా వాడిమీద పడి ఏడుస్తూనే ఉంటారు. అది వారి సహజ లక్షణం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: