పాక్, చైనా, దేశద్రోహుల సరిహద్దు.. కుట్రలు..!

Chandrasekhar Reddy
భారత్ పై చైనా, పాక్, మరియు స్వదేశంలోని ప్రాంతీయ తీవ్రవాదులు(నక్సలిజం, స్లీపర్ సెల్స్) కలిసి వ్యూహాన్ని పన్నుతున్నాయి. ఒకవేళ చైనా యుద్ధం ప్రకటించినా భారత్ దానిపైకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు సైన్యాన్ని చైనావైపు మళ్లించాలి, అలాగే గోతికాడ నక్కలా ఉన్న పాక్ కాశ్మీర్ జోలికి రాకుండా అక్కడ కూడా సైన్యాన్ని మోహరించాలి. ఇక ఇలా చేస్తే దేశంలో ఆయా ప్రాంతాలలో ఉన్న స్లీపర్ సెల్స్ విజృంభించే అవకాశాలు ఉన్నాయి. ఇలా రెండున్నర దేశాలతో భారత్ ఒక్కసారిగా యుద్ధం చేయాల్సి వస్తుంది. దానికి వ్యూహప్రతివ్యూహాలను పన్నడంలో ప్రస్తుతం భారత సైన్యం, ప్రభుత్వం తలమునకలై ఉంది.
ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఈ స్థాయిలో భారత్ ఖచ్చితంగా ముందుకు పోక తప్పదు. ఇప్పటికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దించేందుకు విదేశాల నుండి భారత్ లో కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఆఫ్ఘన్  ఆక్రమణ తరువాత బాగా యాక్టీవ్ అయ్యింది పాక్ ప్రేరేపిత తీవ్రవాద స్లీపర్ సెల్స్. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ దాడిచేస్తారో చూసుకుంటూ, రెండు దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తే అందుకు సైన్యాన్ని ఏవిధంగా వినియోగించాలి అనేదానిపై ఖచ్చితమైన వ్యూహం చాలా అవసరం. ఇక యుద్ధం ఆరంభం అయితే అది ఎన్ని రోజులు జరుగుతుంది, అన్ని రోజులు ఈ పరిస్థితులను జాగర్తగా, కంటిమీద కునుకు లేకుండా జాగర్తగా చూసుకోవాల్సి వస్తుంది.
ఇవన్నీ జరుగుతుండగానే, యుద్ధం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని, ఖర్చులు పెరిగితే భారత్ లో పన్ను విధానంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు పౌరుల జీవన ప్రమాణాలలో ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ముందుకు పోవాల్సి వస్తుంది. ఇలా ఒకటి తరువాత మరో సమస్య తలెత్తుతూనే ఉంటుంది. అలా ఉక్కిరి బిక్కిరి చేయాలనేది ప్రత్యర్థుల వ్యూహం. కానీ అన్నిటికి సిద్ధంగా ప్రతివ్యూహాలతో సిద్ధంగా ఉంది భారత్. ఎందుకంటే భారత మిత్రదేశాలు ఖచ్చితంగా యుద్ధంలో తనతో నడిచే అవకాశాలు ఉంటాయి. శత్రువులను కబళిస్తాయి. ఏది ఏమైనా యుద్దాలు లేని సమాజం కావాలి అని అనుకుంటూ ముందుకు వెళ్తున్న భారత్ తన తప్పు లేకపోయినా యుద్దాలు చేస్తూ పోతుండటం ప్రపంచ శాంతికి పెద్ద దెబ్బ అనేది ఆయా దేశాలు తెలుసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: