కొడాలి సేఫ్...మరి ఆ సీనియర్ ఎమ్మెల్యేల పొజిషన్ ఏంటో?

M N Amaleswara rao
సగం సమయం అయిపోయింది....వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయిపోయాయి. మరి ఈ రెండున్నర ఏళ్లలో ఎంతమంది ఎమ్మెల్యేలు అదరగొట్టే ప్రదర్శన చేస్తూ, ప్రజా మద్ధతు ఇంకా పెంచుకున్నారు...ఎంతమంది ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారంటే...చాలామంది ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత పెరిగినట్లే కనిపిస్తోంది. అయితే తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలని పక్కనబెడితే...ఎంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబరుస్తున్నారు...ఎంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుస్తారనే? అంశంపై ఇప్పుడుప్పుడే క్లారిటీ వస్తుంది.
కృష్ణా జిల్లాలో వైసీపీలో రెండుసార్లుకు మించి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి...రాజకీయంగా అంత అవగాహన ఉండకపోవడం వల్ల కాస్త ప్రజల్లో పట్టు దక్కించుకోవడం లేటు అవుతుంది. కానీ సీనియర్ ఎమ్మెల్యేలకు ఆ సమస్య ఉండదు. మరి అలాంటి ఎమ్మెల్యేలు కూడా మెరుగైన పనితీరు కనబర్చకపోతే, ప్రజలు పక్కనబెట్టేయడం ఖాయం. అయితే కృష్ణా జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలకు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి..ఎంతమంది ఎమ్మెల్యే టఫ్ ఫైట్ ఎదురుకుంటారనే విషయాన్ని ఒక్కసారి చూస్తే....నెక్స్ట్ మంత్రి కొడాలి నానికి మళ్ళీ తిరుగులేదని తెలుస్తోంది. గుడివాడ నుంచి ఈయనకు ఐదోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గుడివాడలో టి‌డి‌పి పరిస్తితి మరీ ఘోరంగా ఉంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌లకు కూడా కాస్త ఎడ్జ్ ఉంది...వీరి గెలుపుకు అవకాశాలు బాగానే ఉన్నాయి.
ఇటు వస్తే పెడన ఎమ్మెల్యే, మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పేర్ని నాని, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిలో టఫ్ ఫైట్ ఎదురుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌లకు కాస్త గెలుపు అవకాశాలు తక్కుగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభానుకు కూడా టఫ్ ఫైట్ తప్పదు. టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: