ఆ అన్నాచెల్లెళ్ల మధ్య ఓ పికే.. చిచ్చు..!

MOHAN BABU
రాహుల్ గాంధీ, ప్రియాంక ల మధ్య పీకే ఎందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు రాజేస్తే పీకే కి లాభం ఏంటి? కాంగ్రెస్ లో చేరుతాడు అనుకున్న ప్రశాంత్ కిషోర్ సడెన్ గా అదే పార్టీపై ఎందుకు  కత్తులు నూరుతున్నారు? ఇండియాలో ది మోస్ట్  వాంటెడ్ పొలిటికల్  స్ట్రాటజిస్ట్ I-PAK ను స్థాపించి, రాజకీయ పార్టీల గమనాన్నే మార్చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టుండి కాంగ్రెస్ పై బాంబులేయడం మొదలెట్టాడు. కాంగ్రెస్ లో చేరుతాడు మంచి పదవి తో ఇక పార్టీలోనే ఉండి స్ట్రాటజీ లకు సాన పడతాడని భావిస్తున్న టైం లో ఆయన రివర్స్ గేర్ స్టార్ట్ చేశారు. ఏకంగా కాంగ్రెస్ కు రెండు ఇరుసుల్లాంటి వారసుల మద్యే చిచ్చు పెట్టాడు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సామర్థ్యాలను చూసి రాహుల్ గాంధీ బయపడుతున్నాడని బాంబు పెల్చాడు పీకే . ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో రచ్చవుతుంది. ప్రియాంక అచ్చం తన నానమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లానే ఉంటారని ఆమె బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అన్నారు.

 ఇంతటితో ఆగని పీకే 2017 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించకపోవడానికి ఇదే కారణమని ఇంకో తూట వదిలారు. ప్రియాంక శక్తి సామర్థ్యాల ఆకర్షణకు అన్న రాహుల్ భయపడుతున్నారని అభిప్రాయపడ్డారు పీకే. ఉత్తరప్రదేశ్ లోని లకింపూర్ కేరీహింసా ఖాండపై కాంగ్రెస్ ఉద్యమాన్ని కూడా కార్నర్ చేశారు పీకే. ఇందువల్ల కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష పాత్ర వేగంగా బలోపేతం అవుతుందని ఆశ పెట్టుకోవడం తొందరపాటు అవుతుందని కాంగ్రెస్ నాయకత్వ సహనానికి పరీక్ష పెట్టారు.

అంతర్గత సమస్యలను  పరిష్కరించకుండా కాంగ్రెస్ పునరుద్ధానం సాధించలేదని వివరించారు.మరోవైపు పీకే మోడీతో మళ్ళీ పని చేస్తారన్న వాదనలు కూడా కొందరు తెరపైకి తెస్తున్నారు. అందుకే రాహుల్,ప్రియాంక ల నడుమ చిచ్చు పెట్టే ప్రయత్నంచేస్తున్నారని యూపీ రైతుల ఉద్యమంలో కాంగ్రెస్ పాత్రను పలుచన చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఒకటి మాత్రం క్లియర్ గా అర్థం అయిపోతుంది పీకే కాంగ్రెస్ లో చేరబోవడం లేదని అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: