బ‌ద్వేల్లో వైసీపీ టార్గెట్ ఆ ఒక్క‌డే...!

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప లోని బద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గా నికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ఏ మాత్రం హ‌డావిడి లేకుండా జ‌రుగుతోంది. ఇక్క‌డ నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ పోటీ లో  లేదు. ఇక జ‌న‌సే న కూడా పోటీ నుంచి త‌ప్పుకుంది. దీంతో ఇప్పుడు ఇక్క‌డ వైసీపీకి పోటీగా జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌, బీజేపీ మాత్ర‌మే పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల‌కు ఇక్క‌డ ఇప్పుడు ఓటు బ్యాంకు లేదు. కాంగ్రెస్ ఒక‌ప్పుడు ఇక్క‌డ ఉన్న ఓటు బ్యాంకు అంతా వైసీపీ కి వెళ్లి పోయింది. దీంతో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే క‌మల‌మ్మ పోటీ లో ఉన్నా కూడా ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించు కునే ప‌రిస్థి తి అయితే లేదు.

ఇక్క‌డ వైసీపీ గెలుపు ఏక‌ప‌క్ష మే .. అయితే ఆ పార్టీ ఇప్పుడు మెజార్టీ మీదే టార్గెట్ పెట్టుకుంది. అయితే బీజేపీలో ఉన్న మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ఈ ఉప ఎన్నిక‌ను కాస్త ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఇక్క‌డ బీజేపీ ఓడిపోయినా ఏ 20 వేల ఓట్లో వ‌స్తే అది ఆదినారాయ‌ణ ఇమేజ్ ను చాటి చెపుతుంది. అందుకే ఆయ‌న ఇక్క‌డ గ‌ట్టిగా పాగా వేసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. అందుకే వైసీపీ వాళ్లు ఇప్పుడు బ‌ద్వేల్ ఉప ఎన్నిక ప్ర‌చారం లో ప్ర‌ధానంగా ఆది నారాయ‌ణ రెడ్డినే టార్గెట్ గా చేసుకుని మ‌రీ విమ‌ర్శలు చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి ఆదినారాయ ణ‌రెడ్డిపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ఆదినారాయ‌ణ‌రెడ్డిని బ‌ద్వేలు ప్ర‌జ‌లు త‌రిమి కొట్టాల‌ని.. వైసీపీ నుంచి గెలిచి, మంత్రి పదవి కోసం పార్టీకి ద్రోహం చేసి వెళ్లాడ‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. ఇక ఆది నారాయ‌ణ గ‌తంలో దళితులకు నాగరికత లేదని మాట్లాడిన విష‌యాన్ని కూడా గుర్తు చేశారు. ఇక క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి సైతం ఆది నారాయ‌ణ రెడ్డి  నే త‌న ప్ర‌చారంలో ప్ర‌ధానంగా విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: