అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ లో  మంత్రి పదవుల విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటనే దానిపై సోషల్ మీడియాలో అదే విధంగా ప్రధాన మీడియాలో కూడా అప్పుడప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో ఏర్పాటు చేసే పలు సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి ఆసక్తికర చర్చలు వింటూ ఉంటాం అలాగే కొన్ని పేర్లను కూడా తరచుగా వింటాం. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఒక మహిళా ఎమ్మెల్యే గురించి కాస్త ఆసక్తి గల వార్తలు వస్తున్నాయి. ఇటీవల రెండు మంత్రి పదవులు ముఖ్యమంత్రి జగన్ భర్తీ చేసిన సమయంలో ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని భావించారు.
కానీ ఆమెకు మంత్రి పదవి రాకపోవడంతో కాస్తా ఆమె నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అసంతృప్తికి లోనయ్యారు అని ఆమె కూడా కాస్త ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యలు వినిపించాయి. రాజకీయంగా జిల్లాలో ఆమెకు తిరుగు లేకపోయినా ఒక ఎంపీ గారితో కాస్త ఇబ్బందులు ఉన్నా సరే వాటిని పరిష్కరించుకునే ఆమె ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆమెకు క్యాడర్ నుంచి కాస్త ఎక్కువగా ఒత్తిడి ఉందని గతంలో మనను  ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అంటే కచ్చితంగా మనకు మంత్రి పదవికి కావాల్సిన అవసరం ఉందని ఆమె వద్ద ఒత్తిడి చేస్తున్నారట.
వారి నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉండడం తో ముఖ్యమంత్రి వైయస్ జగన్ దగ్గర సదరు మహిళా ఎమ్మెల్యే గారు కాస్త ఎక్కువగా వినయం ప్రదర్శిస్తూ కష్టపడుతున్నారని పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. సోషల్ మీడియాలో కాస్త ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న సదరు మహిళా ఎమ్మెల్యే గారు ఇప్పుడు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా సరే ప్రజల్లోకి వేగంగా వెళ్లడం జిల్లాలో జరిగే కార్యక్రమాల విషయంలో కూడా ఆసక్తి చూపించడం వంటివి జరుగుతున్నాయి. మరి సదరు మహిళా ఎమ్మెల్యే గారికి పదవి దక్కుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: