రెడ్ల దెబ్బ‌కు ఆ వైసీపీ ఎమ్మెల్యే విల‌విలా...?

VUYYURU SUBHASH
దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం లో అయినా రాజకీయాల్లో కులాలు, మతాలదే ప్ర‌ధ‌మ‌ ప్రాధాన్యం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఇది మరికొంత ఎక్కువగా ఉంటుంద‌న్న విష‌యంలో ఎలాంటి డౌట్లు అక్క‌ర్లేదు. ఇక్క‌డ టీడీపీ లో క‌మ్మ‌ల‌దే రాజ్యం. వైసీపీ లో రెడ్ల‌దే రాజ్యం. ఇక జ‌న‌సేన లో కాపుల‌దే ఎంతో కొంత ఎక్కువ హ‌వా న‌డుస్తూ ఉంటుంది. ఇక ఏపీలో తెలంగాణ లో లా ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్ డ్ నియోజ‌క‌వ‌ర్గా ల‌లో ఎమ్మెల్యేకు  స్వతంత్రత ఉండదు. వీరు ఆ నియోజకవర్గంలో రాజ‌కీయాల‌ను శాసించే అగ్ర కులాలకు చెందిన నేతలపైనే ఎక్కువుగా ఆధారపడి రాజ‌కీయం చేస్తూ ఉంటారు. లేక‌పోతే వీరిని వారు ఏదోలా ముప్పు తిప్ప‌లు పెడుతూ మూడు చెరువ‌ల నీళ్లు తాగిస్తూ ఉంటారు.

ఇప్పుడు ఏపీలో ప‌లు రిజ‌ర్వ్ డ్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యే లు సైతం ఇదే ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ లిస్టులోనే క‌ర్నూలు జిల్లా నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్ కూడా వ‌స్తారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల లో ఆర్థ‌ర్ కు టిక్కెట్ దక్కడం అనుమానంగానే ఉంది. ఆయ‌న ను ఎవ‌రు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎవ్వ‌రిని లెక్క చేయ‌కుండా స్వ‌తంత్య్రం గానే ముందుకు వెళుతున్నారు.

ఇక్క‌డ వైసీపీ రాజ‌కీయాల‌ను ముందు నుంచి ఆ పార్టీ నియోజ‌క వ‌ర్గ ఇన్ చార్జ్ గా ఉన్న యువ‌నేత siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి శాసిస్తూ వ‌స్తున్నారు. ఇక సిద్ధార్థ్ కు ఏపీ స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్ ప‌ద‌వి ఇచ్చిన తర్వాత వీరి మ‌ధ్య ఆధిప‌త్య పోరు మరింత ఎక్కువయింది. ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరు కావడం లేద‌నే చెప్పాలి. ఇక 2024 ఎన్నికల్లో ఆర్థర్ కు టిక్కెట్ ఇస్తే తాను సహకరించేది లేదని సిద్దార్థ రెడ్డి ఓపెన్ గానే చెప్పేస్తున్నార‌ట‌. తాను చెప్పిన వ్య‌క్తికే తాను సీటు ఇప్పించు కుంటాన‌ని కూడా ఆయ‌న చెపుతోన్న ప‌రిస్థితి ఉందంటున్నారు. ఏదేమైనా అక్క‌డ రెడ్ల దెబ్బ‌తో ఆర్థ‌ర్ రాజ‌కీయంగా తీవ్ర సంక‌ట స్థితిలో ఉన్న మాట నిజం..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: