బద్వేల్ ఉప ఎన్నిక వైసీపీ ఇన్చార్జులకు టెన్సన్ ?

Santhi Kala
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక ఇప్పుడు వైసీపీ ఎన్నికల  ఇంఛార్జులకు కొత్త చిక్కులు తెప్పిస్తోందట.త్వరలో జరగబోయే ఎన్నికకు  సిట్టింగ్ స్థానం,ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వహణకు ఇంచార్జులుగా ఉన్న నేతలకు మాత్రం ఎన్నికపై టెన్షన్ నెలకొందట,అస్సలు సీటింగ్ స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నికపై వైసీపీ నేతల ఆందోళనకు గల కారణం ఏమిటి.ప్రభుత్వం అధికారంలో ఉన్నా,ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థిని నిలపకపోయినా ఇంచార్జ్ నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు.

బద్వేల్ ఉప ఎన్నిక ఇప్పుడు వైసీపీ నేతలకు కొత్త తల నొప్పిని తెప్పిస్తోందట.ప్రధాన ప్రతిపక్ష బరిలో లేనప్పటికీ ఎన్నిక జరుగుతున్న స్థానం సిట్టింగ్ అయినప్పటికి కూడ ఎన్నిక  కోసం ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు నేరుగా జగన్ తీసుకున్నప్పటికి పార్టీలోని కొందరి నేతలకు మాత్రం ఇప్పుడు కొత్త చిక్కులకు కారణం అయిందట.కేంద్ర ఎన్నికల సంఘం బద్వేల్ ఉపఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగి సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య దాసరి సుదను అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు సుధా గెలుపు కోసం పార్టి ఎమ్మెల్యేలు,సీనియర్ నేతలను రంగంలోకి దింపారు.ఉపఎన్నికలో అభ్యర్థి విజయం కోసం పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు,నియోజకవర్గ పరిధిలో ఇన్చార్జుల నియామకం,సామాజిక వర్గాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించి గతం కంటే మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలని ఆదేశించారు.అందులో భాగంగా నేరుగా ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి పాలనాపరమైన అంశాలు,సంక్షేమం,అభివృద్ధి,
లాంటి అంశాలను  ప్రస్తావిస్తూ ఉప ఎన్నికల్లో విజయం సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్.
ఇదిలా ఉంటె ఉప ఎన్నికల్లో  వైసీపీ అభ్యర్థి దాసరి సుధ విజయం సునాయాసం అయినప్పటికీ కూడా ఉప ఎన్నిక కోసం ఇన్చార్జులుగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలకు మాత్రం  ఆందోళన నెలకొందట.
నియోజకవర్గంలో ఎన్నికల మానిటరింగ్ కోసం ప్రత్యేకంగా 7గురు ఎమ్మెల్యేలను నియమించిన  వారిలో  కొందరు మాత్రం ఉప ఎన్నిక పోలింగ్ పై టెన్షన్ పడుతున్నారట.సార్వత్రిక ఎన్నికలు ముగిశాక నియోజక వర్గంలో నెలకొన్న పరిణామాలు పైగా పార్టీ అధినేత  సీఎం సొంత జిల్లా కావడంతో ఫలితాల శాతం ఎలా ఉండబోతోందన్న ఆందోళన మండలాల వారిగా ఇన్చార్జుల ఉన్న ఎమ్మెల్యేలలో నెలకొందట. పైగా ఇన్చార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గంతో సంబంధం లేకపోవడం పైగా నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు కూడా ఉప ఎన్నిక విషయంలో  తమను ఆందోళనకుగురి చేస్తుందని వాపోతున్నారు.సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద తొలిసారిగా జరిగిన ఉప ఎన్నిక రివ్యూ సందర్భంగా కొందరు నేతలు మండలాల వారీగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన తరువాత నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాల  తెలుసుకున్న తరువాత ఉప ఎన్నికల్లో తమ బాధ్యతలు తీసుకున్న మండలాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోన్నన్న ఆందోళన చెందుతున్నారట.

మరోవైపు ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బరిలో లేనప్పటికీ కాంగ్రెస్, బిజెపి బరిలో ఉండటంతో ఓటింగ్ శాతం ఎలా ఉండబోతోందన్న ఆందోళన సైతం వైసీపీ ఇన్చార్జుల్లో నెలకొందట. గతంలో ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ సాధించాలని సీఎం జగన్ ఇన్చార్జులకు సూచించడంతో ఆదిశగా ఫలితం ఉంటుందా లేదా అనేది ఇన్చార్జ్ నేతలను వేధిస్తోంది. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడం విప్ లుగా,ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి బాధ్యతలు అప్పగించడంతో ఇప్పుడు వారంతా ఎన్నికల ప్రచారంతో పాటు స్థానిక నేతల్తో చర్చలు జరుపుతు దాసరి సుధాకు అత్యధిక మెజారిటీ కోసం నానా తంటాలు పడుతున్నారట.ఇప్పటికే స్థానికంగా నెలకొన్న వివాదాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి జెడ్పిటిసి స్థానంలో టీడీపీ విజయం సాధించడంతో ఇప్పుడు మరింత క్లిష్టమైన పరిస్థితి ఉందని ఇంచార్జ్ నేతలు అంటున్నారు.మొత్తానికి బద్వేల్ ఉప ఎన్నికల్లో విజయం సునాయాసం అయినప్పటికీ ఫలితాల మెజార్టీ మాత్రం నేతలను ఆందోళనకు గురి చేస్తోందట చూడలి మరి రాబోయే రోజుల్లో ఫలితాల పరిస్థితి ఎలా ఉండబోతోందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: