బంగ్లాలో ఆగ‌ని హింస‌..హిందువుల ఇళ్ల‌కు నిప్పు.. ప‌లు ఇళ్లు ధ్వంసం..!

N ANJANEYULU
బంగ్లాదేశ్‌లో దుర్గామాత పూజ కు సంబంధించిన‌ మొద‌లైన అల్ల‌ర్లు.. రోజు రోజుకు హింసాత్మ‌కంగా మారుతున్నాయి. బంగ్లా రాజ‌ధాని న‌గ‌ర‌మైన ఢాకాకు 255 కీమీ దూరంలో ఉన్న గ్రామంలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకున్న‌దని అక్క‌డి మీడియా వెల్ల‌డించింది.  కానీ దుర్గామాత కాళ్ల ద‌గ్గ‌ర ఖురాన్ ఉండ‌డం మూలంగానే అల్ల‌ర్ల‌కు కార‌ణం అని ప్ర‌చార‌మ‌వుతోంది.  ఓ హిందూ యువ‌కుడు ఫేస్ బుక్ పోస్ట్‌లో మ‌తాన్ని అగౌర‌వ‌ప‌రిచాడ‌ని పోలీసులు మత్స్యకారుల కాలనీకి చేరుకున్నారు.
పోలీసులు ఆ ఇంటి చుట్టూ కాప‌లా కాశారు. ఆ వ్య‌క్తి ఇంటికి స‌మీపంలో ఉన్న ఇండ్ల‌కు దాడి చేసిన వారు నిప్పు పెట్టారు. మ‌త‌ప‌ర‌మైన హింసాత్మ‌కంగా చోటుచేసుకున్న ఘ‌ట‌న‌లో ఆరుగురు వ‌ర‌కు మృతిచెందారు. తాజాగా 20 హిందువుల ఇండ్ల‌కు నిప్పంటించారు. అంతేకాకుండా మ‌రో 66 ఇండ్ల‌ను ధ్వంసం చేశార‌ని అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి.   ఇందులో దాదాపు 100 మంది అరాచ‌క‌వాదులు ఈ ఘాతుకానికి పాల్ప‌డి అల్ల‌ర్లు సృష్టించి.. ఇండ్ల‌ను ధ్వంసం చేశార‌ని స‌మాచారం. హిందూ దేవాల‌యాలు, దుకాణాల‌పై జ‌రిగిన దాడుల‌కు ఎలైట్ నేర‌నిరోధ‌క శ‌క్తి రాపిడ్ యాక్ష‌న్ బెటాలియ‌న్ కొంత‌మందిని అరెస్టు చేసింది. హింస‌కు పాల్ప‌డినందుకు, సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల‌ను ప్రేరేపించ‌డం మూలంగా  అరెస్టు చేసి రిమాండ్ కు త‌ర‌లించారు.
మ‌రోవైపు ప్ర‌ధాని షేక్ హ‌సీనా మ‌త‌ప‌ర‌మైన హింస‌కు పాల్ప‌డిన నిందితుల‌ను శిక్షిస్తాం అని హామి ఇచ్చింది. దాడుల‌కు పాల్ప‌డిన వారు ఎవ‌రైనా స‌రే త‌ప్పించుకోలేర‌ని పేర్కొన్నారు. ఎవ‌రినీ విడిచిపెట్ట‌వ‌ద్ద‌ని అధికారులను ఆదేశించింది. ధాకేశ్వ‌రంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఈఘ‌ట‌న‌పై స్పందించారు. ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగానే ఇష్కాన్ ఆల‌యం, భ‌క్తుల‌పై దుండ‌గులు దాడి చేశారు. చాలా మంది గాయ‌ప‌డ్డారు. ఆ దాడి క్ర‌మ‌క్ర‌మంగా అల్ల‌ర్ల‌కు దారి తీసి హింసాత్మ‌కంగా మారింది. ఇందులో మెజార్టీ వ‌ర్గానికి చెందిన వారు గుండాల‌లాగా ప్ర‌వ‌ర్తించారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప‌లు హిందూ సంస్థ‌లు డిమాండ్ చేశాయి. మ‌త‌ప‌ర‌మైన విధ్వంసం, భ‌ద్ర‌తా సిబ్బందిపై చేప‌ట్టిన దాడి కార‌ణంగానే ఢాకాలోని ర‌మ్నా, ఫ‌ల్తాన్‌, చౌక్‌బ‌జార్ వంటి పోలీస్ స్టేష‌న్‌ల‌లో నాలుగువేల‌కు పైగా కేసులు న‌మోదు అయ్యాయి. ఈ అల్ల‌ర్లు మిగ‌తా జిల్లాల‌కు ఎగ‌బాకాయి. దీంతో ఆరుగురు హిందువులు చనిపోయారని బంగ్లా హిందూ బుద్దిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ వెల్ల‌డించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: