డ‌బ్బున్నోడి డ్ర‌గ్ : షారుఖ్ కొడుకు మారిపోయాడు సర్ ?

RATNA KISHORE
జైలు జీవితం కార‌ణంగా కొంద‌రిలో వ‌చ్చే మార్పును చూసి ఈ స‌మాజం మ‌రియు తోటివారు ఆనందించేందుకు అవ‌కాశం ఇవ్వండి. షారుఖ్ కొడుకు ఇలాంటి ప‌నేదో ఒక‌టి చేయాల‌ని అనుకుంటున్నాడు. మారేందుకు అవ‌కాశాలు వెత‌క‌డం త‌ప్పేం కాదు. మారితే ఎంతో మేలు కూడా!

మ‌నుషులంతా ఎలా ఉంటారు ఎలా ఉండాలి.. షారుఖ్ ని అడిగి చెబుతాను ఉండండి. మ‌నుషులు చ‌దువుల‌కు వాటి విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాలి. విదేశాల్లో చ‌దివాడు క‌దా అని అత‌డు డ్ర‌గ్ తీసుకోవ‌డం అన్న‌ది అంత ఆమోద‌యోగ్యత కాదు. ఫారెన్ క‌ల్చ‌ర్ లో అక్క‌డి చ‌ట్టాలు వీటిని నేరంగా ప‌రిగ‌ణించ‌వు. ఒప్పుకుంటాం కానీ ఇక్క‌డ ఇండియ‌న్ సొసైటీ ఇలాంటివి అంగీక‌రించ‌దు. డ్ర‌గ్ తీసుకోవ‌డం వాటి కోసం వెంపర్లాడ‌డం అన్న‌వి నేరాలే!

ఈ నేరాల కార‌ణంగానే టాలీవుడ్ రానా  కూడా పోలీసుల ఇంట్రాగేష‌న్ కు చిక్కాడు. ఇంకా ఈ నేరాలు చాలా మంది హైద్రాబాద్లో  చేస్తూనే ఉన్నారు. ప్ర‌ముఖుల బిడ్డ‌లు ప‌దిమందికీ ఆద‌ర్శం కావాల‌ని కోరుకోవ‌డంలో ఏ త‌ప్పూ లేదు. ఇందులో మ‌ళ్లీ మైనార్టీ, మెజార్టీ వ‌ర్గాల పేరిట మాట్లాడాల్సిన ప‌నే లేదు. ముంబ‌యి పోలీసులు ఆర్య‌న్ ను మార్చే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌న్న‌ది ఓ వార్త. మంచిదే ! ఆర్య‌న్ మారితే సంతోషించాలి. త‌ప్ప‌క అభినందించాలి. ఆ దిశ‌గా అంతా స‌హ‌క‌రించాలి కూడా! మ‌నుషుల్లో ఇదివ‌ర‌కు ప్ర‌వ‌ర్త‌న క‌న్నా మేల‌యిన ప్ర‌వ‌ర్త‌న వ‌స్తుందంటే అదొక మంచి ప‌రిణామాల‌కు సంకేత‌మే!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ మారిపోయాడు. డ్ర‌గ్ కేసులో నానా అవ‌స్థ‌లూ ప‌డుతూ జైలు జీవితం అనుభ‌విస్తున్న ఆర్య‌న్ మారిపోయాడు. బిస్క‌ట్లు తిని జైలు జీవితం అనుభ‌విస్తున్న ఆర్య‌న్ మారిపోయాడు. పోలీసుల కౌన్సిలింగ్ తో మారిపోయాడు. ఇందుకు ప‌లు మాట‌లు నిద‌ర్శ‌నం అయి ఉన్నాయి. త‌న‌కు స‌మాజ సేవ చేయాల‌ని ఉంద‌ని అంటున్నాడు. మారిపోయి మంచి వాడిగా పేరు తెచ్చుకోవాల‌ని అనుకుంటున్నాడు. గ‌తంలో చేసిన త‌ప్పులేవీ చేయ‌ను అని కూడా పోలీసుల‌కు ప్రామిస్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: