పొత్తు కుదిరేనా! : పాత తప్పిదాల్లో పవన్?

RATNA KISHORE
ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయంగా మంచివాడో చెడ్డ‌వాడో అన్న‌ది ప్ర‌జ‌లు తేలుస్తారు. అది వారి నిర్ణ‌యం మ‌రియు వారి విజ్ఞ‌త. రాజకీయాల్లో ప‌వ‌న్ ను మించిన యోధులు ఉన్నారు. ప‌వ‌న్ ను మించిన తెలివైన‌, అనుభ‌వ‌జ్ఞులు అయిన నాయ‌కులు ఉన్నారు.

 
అందుకే వారిని దాటి ప‌వ‌న్ రాజకీయం చేయ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టుల‌తో పొత్తు పెట్టుకుని ఏమీ సాధించ‌లేక‌పోయారు. పొత్తులు లేకుండా ఉంటే బెట‌ర్ అన్న వాద‌న ఆయ‌న విష‌య‌మై వినిపించింది కూడా! త‌రువాత కాలంలో ప‌వ‌న్ చాలా సైలెంట్ అయిపోయారు. పార్టీని వ‌దిలి పోవాల‌న్నంత కోపంతో కూడా ఉన్నారు. త‌న‌ని అభిమానించే వారంతా ఓట్లు వేయ‌కుండా కేవ‌లం బ‌హిరంగ స‌భ‌ల్లో అరుపులు అరిచి, కేక‌లు వేసి, త‌న న‌మ్మ‌కాన్ని త‌ల‌కిందులు చేశార‌ని ఆవేద‌న చెందారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా ప‌వ‌న్ మ‌ళ్లీ కొన్ని త‌ప్పులు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో దోస్తీ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొంద‌రు అభిమానులు అయితే ప‌వ‌న్ నిర్ణ‌యాల‌ను బాహాటంగానే వ్య‌తిరేకిస్తూ, ఇది క‌రెక్ట్ కాద‌ని చెప్పేస్తున్నారు. కొంద‌రు మాత్రం స‌మ‌ర్థిస్తూ పోతున్నారు. అధినేత ఏం చెబితే అదే అన్న విధంగా స్పందిస్తున్నారు. ఈ త‌రుణంలో ప‌వ‌న్ - బాబు ద్వ‌యం క‌లిసి సాధించేదేముంటుంది?


2014 ఎన్నిక‌ల్లో పొత్తులో భాగంగా టీడీపీకి ఎంతో సాయం చేశారు. క‌నీసం రాజ్య స‌భ ప‌ద‌వి ఇస్తాన‌న్నా కూడా తీసుకోలేదు. ప‌ద‌వులేవీ వ‌ద్ద‌నే చెప్పి రాష్ట్రంలో సుస్థిర ప్ర‌భుత్వం ఏర్ప‌డేందుకు త‌న వంతు సాయం చేస్తాన‌ని చెప్పి, బీజేపీ, టీడీపీల‌తో క‌లిసి  ప‌నిచేసి బాబుకు అధికారం ద‌క్కేలా కృషి చేశారు. త‌రువాత కొన్ని స‌మ‌స్య‌ల‌పై గొంతు వినిపించారు. వాటిపై సీఎం హోదాలో చంద్ర‌బాబు స్పందించారు. మళ్లీ ఇప్పుడు చాలా రోజుల‌కు పాత బంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌లో ఉన్నారు ప‌వ‌న్. యాభై సీట్లు పొత్తుల్లో భాగంగా అడ‌గ‌నున్నార‌ని స‌మాచారం. ఇందుకు బాబు సైతం ఒప్పుకున్నార‌ని టాక్. కానీ క్షేత్ర స్ధాయిలో ప‌వ‌న్ కు తెలుగుదేశం శ్రేణులు మ‌ద్ద‌తుగా ఉంటాయా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: