చాలా రోజులుగా బాబు, బీజేపీ ఒక్కటిగా లేవు. చాలా రోజులుగా బాబు, బీజేపీ దూరంగా ఉంటూనే తిట్టుకుంటూనే దగ్గర అయ్యేం దుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. అదే విడ్డూరం. బాబు, బీజేపీ బంధం ఒక్కసారిగా తెగిపోదు. అలా అని మరిచిపోరు కూడా ఇరు వర్గాలూ ఒకరినొకరు. కొంతకాలం బాబు అనే లీడర్ బీజేపీ అడుగుజాడల్లోనే నడిచారు. మోడీని సుప్రీమ్ హీరో అన్నారు. ఆయన ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది అని కూడా అన్నారు. ప్రధాని మోడీ కూడా సంబరపడ్డాడు. రాజధానికి కొన్ని నిధులు ఇచ్చి వెళ్లారు. అదేవిధంగా ప్యాకేజీ కూడా ఇచ్చి పంపారు.
కానీ బాబు కారణంగా హోదాను మరిచిపోయి, ప్యాకేజీ ఇచ్చి పంపడంలో అర్థం లేదు అని ఆంధ్రా ప్రజలు అనుకున్నారు. బయటపడ్డారు కూడా! ఇదే అదునుగా జగన్ సీన్లోకి వచ్చాడు. పిల్లాడు ఏం చేయగలడు. ఏం సాధిస్తాడు అని అనుకున్నాడు బాబు కానీ.. సాధించాడు. లోకేశ్ ను ఓడించాడు. చంద్రబాబు సీఎం కుర్చీ ని మరిచిపోయేలా చేశాడు. అంతేకాదు హోదా విషయమై మైకుల ముందు 1 2 3 చెప్పి మరీ! అరిచాడు. ఇవన్నీ జగన్ కు ప్లస్ అయ్యాయి. అధికారం కట్టబెట్టాయి. మా శ్రీకాకుళం జగన్ వచ్చి కూడా ఇవే మాటలు చెబితే జనం చప్పట్లు కొట్టారు. అప్పుడు కూడా హోదా వస్తుందనే అనుకున్నారు కానీ రాలేదు.
అయినా కూడా ఈ రెండున్నరేళ్లలో హోదా ఊసు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎత్తడం లేదు. ఆ విధంగా జగన్ కనుసన్నల్లో బీజేపీ కనుసన్నల్లో హాయిగా టీడీపీ రాజకీయం చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్లీ బాబు తన కోపం అంతా చూపిస్తాడు. పిల్లాడు అయిన జగన్ ను తిడతాడు. అదేవిధంగా ఇంకొన్ని విమర్శలు బూతులు మాట్లాడే అయ్యన్నతో అనిపిస్తాడు. అచ్చెన్నకు విమర్శలు చేసే ఇష్టం లేకపోయినా పర్లేదు తిట్టు ఏం కాదు అని కూడా అంటాడు. ఇలాంటి సందర్భంలో పొత్తుల కోసం మాట్లాడుకోవాలి. ఎవరు ఎవరిని తిట్టినా అదంతా రాజకీయం కనుక పెద్దగా పట్టించుకోకూడదు. బాబు కొన్ని విషయాలు బాగుంటారు. జగన్ కొన్ని విషయాలు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించి పైకి బాగున్న విధంగా కనిపిస్తాడు. కానీ రాజధాని విషయమై బాబు విజన్ ను జగన్ అర్థం చేసుకోలేకపోయాడు. అందుకనో ఎందుకనో ఎవ్వరికీ ఏమీ కాకుండా ఆ అమరావతీ భవనాలను పూర్తిగా భ్రష్టు పట్టించేశాడు.ఇక కొత్త పొత్తుల మాటకు వస్తే బాబును బీజేపీ నమ్మడం జరగని పని అని తేలిపోయింది. దీంతో పిల్లాడయినా జగన్ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు. మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని గాట్టిగా అరుస్తున్నాడు. పిల్లాడు కదా! అని పెద్దవాడు అయిన చంద్రబాబు సర్దుకుపోయి సైడ్ అయిపోతున్నాడు.