చతికిలపడ్డ.. చైనా వృద్ధి.. !

Chandrasekhar Reddy
చైనా వృద్ధి రేటులో చతికిలపడినట్టే ఉంది. గతంతో పోలిస్తే తాజా వృద్ధి 7.9 శాతం మేర లోటు కనిపించింది.  జూన్ త్రైమాసికంలో స్థూల జాతియోత్పత్తి(జీడీపీ)  శాతంగా ఉండగా తాజా త్రైమాసికంలో కేవలం 4.9 శాతంగా మాత్రమే ఉన్నట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా చైనా లో పెద్ద పెద్ద సంస్థలు కుదేలైపోవటంతో ముఖ్యంగా రియాల్టీ రంగం పూర్తిగా దెబ్బతినడంతో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఆర్థిక వ్యవస్థ వెనకపడిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇదే వృద్ధి రేటు మార్చిలో 18.3 శాతం గా నమోదు అయ్యింది. మొత్తం మూడు త్రైమాసికాలలో వృద్ధి రేటు 9.8శాతంగా ఉంది. 2020 లో కరోనా సమయంలో మొదటి త్రైమాసికంలో గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ చూడని క్షిణత చైనా చూడాల్సి వచ్చింది. ఇది 6.8 శాతంగా ఉంది.
అదే ఏడాదిలో రెండో త్రైమాసికంలో 3.2 శాతం, మూడో త్రైమాసికంలో 4.9 శాతం వృద్ధి రేటు సాధించింది. నాల్గవ త్రైమాసికంలో 6.5 శాతం వృద్ధి రేటు సాధించింది. అంటే ఆర్థిక ఏడాది మొత్తం మీద 2.3 శాతం వృద్ధి సాధించినట్టు అయ్యింది.  గడిచిన నాలుగు దశాబ్దాలలో ఇంత తక్కువ జీడీపీ రేట్ ఎక్కడా నమోదు చేసుకోలేదు చైనా. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు దశాబ్దకాలంలో పోలిస్తే గరిష్ఠంగానే ఉందని చెప్పాలి. అది 8.4 శాతంగా ఉంది. ఈ మేరకు చైనా వృద్ధి రేటును అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అంచనా వేసింది.
అయితే ఇదంతా చైనా మరోసారి వ్యవస్థలను బెదిరించడం ద్వారా తన వృద్ధి రేటును పాజిటివ్ గా చూపించి మరోసారి ప్రపంచాన్ని మోసం చేయడానికి సిద్దపడుతున్నట్టు నిపుణులు అంటున్నారు. తాను పూర్తిగా సంక్షోభంలో ఉన్నట్టు ప్రపంచానికి తెలియకుండా బొంకడానికే ఇలాంటి పనులకు చైనా పాల్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఐక్యరాజ్య సమితి లో అధికారులనే ప్రలోభాలకు గురిచేసి తన ర్యాంక్ పాజిటివ్ గా తీసుకున్న సంగతి ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: