టీడీపీకి మరో రేవంత్ రెడ్డి దొరికినట్లేనా?

M N Amaleswara rao
ఎంత కాదు అనుకున్న..తెలుగుదేశం పార్టీలో నాయకులకు ఏ మాత్రం కొదవ లేదనే చెప్పాలి. అలాగే ఆ పార్టీ నుంచే బలమైన నాయకులు తయారవుతారు. అది పార్టీ పెట్టిన దగ్గర నుంచి జరుగుతుంది. అటు తెలంగాణలో గానీ, ఇటు ఏపీలో గానీ తెలుగుదేశం కాకుండా ఇతర పార్టీల్లో ఎంతమంది టి‌డి‌పి నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో చెప్పాల్సిన పని లేదు.

 
అలా టి‌డి‌పి నుంచి రాజకీయం ఎదిగి సత్తా చాటుతున్న నాయకుల్లో రేవంత్ రెడ్డి కూడా ఒకరు. టి‌డి‌పిలో రేవంత్ అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తన దూకుడు రాజకీయం, తన పదునైన మాటలతో సక్సెస్ అయ్యారు. ఇక రేవంత్‌కు చంద్రబాబు సపోర్ట్ ఎలా ఉండేదో కూడా చెప్పాల్సిన పని లేదు. అయితే అలాంటి నాయకుడు కాంగ్రెస్‌లోకి వెళ్ళాక తెలంగాణలో టి‌డి‌పి పరిస్తితి ఏమైందో తెలుస్తూనే ఉంది.
ఇక రేవంత్ వెళ్లిపోయాక అంతటి స్థాయిలో టి‌డి‌పికి నాయకులు దొరకలేదనే చెప్పాలి. తెలంగాణలో అయినా, ఏపీలో అయినా అలాంటి నాయకుడు కనబడలేదు. అయితే త్వరలో టి‌డి‌పిలో చేరబోతున్న యువ నాయకుడు జి. వెంకటరెడ్డి టి‌డి‌పిలో మరో రేవంత్ రెడ్డి అవుతారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అసలు వెంకటరెడ్డి అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు...కానీ టీవీ డిబేట్లు చూసేవారికి వెంకటరెడ్డికి బాగా తెలుసు. కాంగ్రెస్ తరుపున డిబేట్లలో పాల్గొనే జీవీ రెడ్డి....సూటిగా సుత్తిగా ఉన్న సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ అందరినీ ఆకర్షిస్తారు. మాటల ఎదురుదాడి ఉండదు...కానీ తన సబ్జెక్ట్‌తోనే ప్రత్యర్ధులకు చెక్ పెడతారు. ఇప్పటివరకు ఆయన...వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తిచూపిస్తూనే ఉన్నారు.


ఏదో నోరు వేసుకుని పడిపోకుండా, ప్రతి విషయం ప్రజలకు అర్ధమయ్యేలా మాట్లాడుతూ, ఆకట్టుకుంటారు. అలాంటి నాయకుడు ఇప్పుడు టి‌డి‌పిలో చేరబోతున్నారు. వెంకటరెడ్డి టి‌డి‌పిలో చేరితే, ఆ పార్టీకే ప్లస్ అవుతుందనే చెప్పొచ్చు. టి‌డి‌పి తరుపున బలమైన వాయిస్ వినిపించే నాయకుడు అవుతారు. అలాగే జీవీ రెడ్డి...మరో రేవంత్ రెడ్డి మాదిరిగా ఎదుగుతారని టి‌డి‌పి శ్రేణులు భావిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: