అనంత తమ్ముళ్ళు కథ మార్చేస్తున్నారుగా!

M N Amaleswara rao
రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన జిల్లా ఏదైనా ఉందంటే అది అనంతపురం జిల్లానే. మొదట నుంచి ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఇక్కడ టి‌డి‌పి చాలా స్ట్రాంగ్‌గా ఉందనే చెప్పొచ్చు. 2014 ఎన్నికల్లో కూడా జిల్లాలో ఉన్న 14 సీట్లలో టి‌డి‌పి 12, వైసీపీ 2 గెలుచుకున్నాయి. కానీ 2019 ఎన్నికల్లోనే సీన్ మారింది...వైసీపీ 12, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకున్నాయి.
కాకపోతే అనంతలో టి‌డి‌పి స్ట్రాంగ్ కాబట్టి, త్వరగానే పుంజుకుంది. వైసీపీ అధికారంలో ఉన్నా సరే అనంతలో టి‌డి‌పి నేతలు ఓ రేంజ్‌లో కష్టపడుతూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. మిగిలిన జిల్లాలో టి‌డి‌పి నేతలు కాస్త అటు ఇటు పనిచేస్తున్నా సరే...అనంత జిల్లాలో అందరూ ఎఫెక్టివ్ గానే పనిచేస్తున్నారనే చెప్పొచ్చు. నాయకులు ఓటమి పాలైనా సరే వెనక్కి తగ్గకుండా పనిచేసుకుంటూ వస్తూ పార్టీని చాలావరకు బలోపేతం చేశారు.


ఆలాగే సీమలో నీటి సమస్యలపై మొదట పోరాటం మొదలుపెట్టింది అనంత తమ్ముళ్లే. వరుసగా సమావేశాలు పెడుతూ, సీమలో ప్రాజెక్టులని త్వరగా పూర్తి చేసి రాయలసీమకు నీటి కొరత లేకుండా చేయాలని పోరాటాలు చేస్తున్నారు. ఢిల్లీ వరకు వెళ్లడానికి అనంత తమ్ముళ్ళు సిద్ధమవుతున్నారు. ఇలా అనంతలో టి‌డి‌పి లీడర్లు దూకుడుగా పనిచేయడం వల్ల, జిల్లాలో పార్టీ చాలా వరకు పుంజుకుంది. పైగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు కూడా అంత ఆశాజనకంగా కూడా లేదని తెలుస్తోంది.
ఇదే టి‌డి‌పి నేతలకు బాగా ప్లస్ అవుతుంది. అందుకే జిల్లాలో 14 నియోజకవర్గాల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో టి‌డి‌పి నేతలు పుంజుకున్నట్లు కనిపిస్తోంది. టి‌డి‌పి గెలిచినా ఉరవకొండ, హిందూపురం స్థానాలని పక్కనబెడితే....కదిరి, తాడిపత్రి, రాప్తాడు, కళ్యాణదుర్గం, మడకశిర, రాయదుర్గం, పెనుగొండ లాంటి నియోజకవర్గాల్లో టి‌డి‌పి పికప్ అయింది. ఇక ఎన్నికల వరకు ఇంకా కష్టపడితే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టి‌డి‌పి పట్టు సాధిస్తుంది. మొత్తానికి అనంతలో తమ్ముళ్ళు రాజకీయ కథ మొత్తం మార్చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: