విశాఖ నుంచే లోకేష్... ?

Satya
విశాఖపట్నం ఏపీలో అతి పెద్ద నగరం. అంతే కాదు ఉత్తరాంధ్రా జిల్లాలకు ముఖ ద్వారం. విశాఖ నుంచి స్పీడ్ పెంచితే మొత్తం మూడు జిల్లాల్లో రాజకీయం మారుతుంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలు వైసీపీకి పట్టం కట్టాయి. నిజానికి ఇవి తెలుగుదేశానికి కంచుకోటలు.
అటువంటి చోట గేర్ మార్చాలని, స్పీడ్ పెంచాలని టీడీపీ ఆరాటపడుతోంది. టీడీపీ యువ నాయకుడు లోకేష్ విశాఖ జిల్లాలోనే ఎక్కువగా టూర్స్ చేస్తున్నారు. ఆయన తాజాగా మరో మారు విశాఖ వస్తున్నారు. విశాఖ రూరల్ జిల్లా అనకాపల్లిలోని పార్టీ ఆఫీస్ ని ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా బహిరంగ సభ కూడా ఉంటుంది. లోకేష్ ఆ సభ ద్వారా ఏపీ సర్కార్ మీద ఘాటైన విమర్శలు చేస్తారు అంటున్నారు.
మరో వైపు చూస్త వచ్చే ఎన్నికల్లో లోకేష్ విశాఖ నుంచి పోటీ చేస్తారని కూడా పార్టీ వర్గాల నుంచి వినవస్తున్న మాట. 2019 ఎన్నికల వేళ లోకేష్ భీమిలీ నుంచి పోటీ చేయాల్సి ఉంది. చివరి నిముషంలో ఆయన మనసు మార్చుకుని మంగళగిరి వైపు వెళ్లారు. అక్కడ ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం విశాఖ సిటీ నుంచి పోటీ తప్పదని అంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఉత్తరాంధ్రా జిల్లాల్లో వైసీపీ కూడా బాగానే బలపడింది. బీసీలను ఆ పార్టీ ఆకట్టుకుంటోంది. అనేక పదవులు కూడా వారికి ఇచ్చింది. దాంతో మళ్లీ బంపర్ విక్టరీని కొట్టాలని వైసీపీ చూస్తోంది. ఆ పార్టీ దూకుడుని అడ్డు కట్ట వేయాలన్నా, అధికారం ఈసారి హస్తగతం చేసుకోవాలనుకున్నా కచ్చితంగా విశాఖ నుంచే పాలిటిక్స్ చేయాలని లోకేష్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. మొత్తానికి లోకేష్ విశాఖ నుంచే విజయశంఖం పూరిస్తారు అని ఆ పార్టీ ఉత్తరాంధ్రా ఇంచార్జి బుద్ధా వెంకన్న అంటున్నారు. ఆయన విశాఖ నుంచే టీడీపీకి విజయాలు తీసుకువస్తారు అని కూడా ధీమాగా చెబుతున్నారు. ఉత్తరాంధ్రాలో వైసీపీ పని అయిపోయింది అని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: