కడప మీద చంద్రబాబు గురి ఎందుకు...?

Gullapally Rajesh
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ బలోపేతం కోసం ఇప్పుడు గట్టిగా కష్టపడుతూ కొంతమంది కీలక నాయకులను పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. రాజకీయంగా రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా కనపడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న బలమైన నాయకులను పార్టీలోకి తీసుకునే అవకాశం ఎంత వరకు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు వదలడం లేదని చాలామంది కీలక నాయకుల మీద గురి పెట్టారని అంటున్నారు. ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకత్వం మీద చంద్రబాబు ఫొకస్ పెట్టడం బాగా హైలెట్ అవుతుంది.
జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కొంతమంది కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే కొంతమంది వైసీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి డీఎల్  రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ నెలలో కచ్చితంగా డీఎల్ రవీంద్రారెడ్డి తన సన్నిహితులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. డీఎల్ రవీంద్రారెడ్డి తో పాటుగా మరికొంతమంది కీలక నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నారని మాజీ ఎమ్మెల్సీ తులసి రెడ్డి కూడా పార్టీ మారవచ్చని అంటున్నారు.
వీరితో పాటుగా మండల స్థాయి నాయకులతో కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నేరుగా చర్చ జరుపుతుంది అనే వార్తలు వినపడుతున్నాయి. అదేవిధంగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ మారేందుకు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నారని ఇప్పటికే జిల్లా నాయకులతో కూడా చర్చలు జరిపారని అలాగే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు అని అంటున్నారు. మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన హామీ వస్తే భవిష్యత్తు ఇబ్బందుల గురించి క్లారిటీ వస్తే కచ్చితంగా పార్టీలోకి రావడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: