క‌రోనా థ‌ర్డ్ వేవ్‌... ఆ గండం గ‌ట్టెక్కితే ముప్పు లేన‌ట్టే...!

VUYYURU SUBHASH
ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా కోట్లాది మంది జ‌నాల‌ను ముప్పు తిప్ప‌లు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇక ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత చాలా మంది రెండో వేవ్ ముప్పు ఉంటుంద‌ని ముందుగానే హెచ్చ‌రించారు. అయితే మ‌రి కొంద‌రు ఈ హెచ్చరిక‌ల‌ను ఏ మాత్రం ప‌ట్టిం చు కోకుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హరించారు. దీంతో క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌పంచాన్ని.. ఇంకా చెప్పాలంటే మ‌న దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది.

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్రంగా న‌ష్టోవడంతో పాటు ప‌ది సంవ‌త్స‌రాలు వెన‌క్కు వెళ్లిపోయింది. ఇక ఎంతో మంది టాలెంట్ ఉన్న వారితో పాటు యువ‌కులు సైతం చ‌నిపోయారు. అయితే సెకండ్ వేవ్ చేసిన వైరాల‌జిస్టులు ఖ‌చ్చితంగా మ‌న దేశానికి థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంటుంద‌ని... ప్ర‌జ‌లు అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. చాలా మంది అక్టోబ‌ర్ లోనే థ‌ర్డ్ వేవ్ ఉంటుంద‌ని చెపుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ఆ సంకేతాలు రాలేదు.

అయితే మ‌రి కొంద‌రు వైరాల‌జిస్టు ల‌తో పాటు ఢిల్లీ లోని ఎయిమ్స్ వైద్య నిపుణులు మాత్రం వ‌చ్చే సంక్రాంతి నుంచి ఏప్రిల్ మ‌ధ్య‌లో ఎప్పుడు అయినా క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఉంటుంద‌ని చెప్పారు. ఇందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. 2020 లోనూ, 2021 లోనూ అదే టైంలో క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌, సెకండ్ వేవ్ తో తీవ్రంగా విరుచు కు ప‌డింది. ఇక ఇప్పుడు మూడో వేవ్ కూడా అదే టైంలో ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక వేళ ఈ టైంలో క‌రోనా రాక‌పోతే మాత్రం క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముప్పు తిప్పిన‌ట్టే అని అంచ‌నా వేస్తున్నారు.

ఇక క‌రోనా సెకండ్ వేవ్ న‌ష్టం త‌ర్వాత చాలా మంది మ‌ళ్లీ రిలాక్స్ అయిపోతూ క‌నీస జాగ్ర‌త్త‌లు కూడా పాటించ డం లేదు. అయితే ప్ర‌జ‌లు ఈ నిర్ల‌క్ష్యాన్ని వీడ‌నాడి వ‌చ్చే ఏప్రిల్ - మే వ‌ర‌కు క‌నీస జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: