రేటింగ్ లో వెనుకపడ్డ.. జో బైడెన్.. !

Chandrasekhar Reddy
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షపదవి చేపట్టి కొద్ది కాలమే అయినప్పటికీ ఇంతలోనే ఆయన కు ప్రజాదరణ తగ్గినట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం ఆయన అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి తీసుకున్న నిర్ణయాలు అన్ని ప్రజలు ప్రశ్నించేవిగానే ఉన్నాయని నివేదికల ద్వారా తెలుస్తుంది. ఆయన పదవి చేపట్టిన తరువాత పన్నులు అధికం అయ్యాయి, కరోనా నియంత్రణలోకి తేలేకపోవడం, ఆఫ్ఘన్ సమస్యపై నోరెత్తలేకపోవడం లాంటివి ప్రజలలో ఆయన పట్ల వ్యతిరేకతను లేవనెత్తిన అంశాలు. అయితే ఈ సమస్యలపై మాజీ అధ్యక్షుడు ఒబామా తో బైడెన్ మాట్లాడుతూ ఉన్నారని వైట్ హౌస్ వర్గాలు అంటున్నారు.
ప్రతి సమస్యపై బైడెన్ మాజీ అధ్యక్షుడితో మాట్లాడటం సహా ఆయనతో కలిసి నవంబర్ మొదటి వారం లో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ శిఖరాగ్ర సమావేశం లో పాల్గొనే అవకాశాలు ఉండటాన్ని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమావేశం స్కాట్లాండ్ గ్లాస్లో వేదికగా జరుగుతుంది. ఇలాంటి ఒప్పందాలు ఒకప్పుడు ఒబామా అధ్యక్షతన జరిగాయి, మళ్ళీ ఇప్పుడు బైడెన్ అధ్యక్షతన జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాలలో ఇద్దరు కలిసి పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికల అవకాశాలు ఉన్నట్టు ఒక ప్రముఖ పత్రిక  కధనం రాయడం, బైడెన్ కు ప్రజాదరణ కనీసం 50 శాతం కూడా లేకపోవడం తో డెమొక్రాట్ల పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఒబామా తో బైడెన్ మాట్లాడటం వలన ఆయన ప్రజాదరణ రానురాను తగ్గిపోతుంది.
కునిఫియక్ విశ్వవిద్యాలయం వారు ప్రజాదరణ సర్వే నిర్వహించారు. దీనిలో బైడెన్ కు రేటింగు బాగా తగ్గిపోయినట్టు వెల్లడైనది. ప్రజలలో ఆయనకు కేవలం 38 శాతం ఆదరణ మాత్రమే ఉన్నట్టు, ప్రజావ్యతిరేకత 53 శాతం వరకు ఉన్నట్టు ఆ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో ఇదే ప్రజాదరణ 42శాతం ఉండగా, ప్రజావ్యతిరేకత 50 శాతంగా ఉంది. రానురాను బైడెన్ కు ప్రజాదరణ తగ్గుతూ వస్తుంది. ఆయన అధ్యక్షులు అయ్యి 9 నెలలే అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: