తాలిబన్ల కోసం.. మరోసారి ఆ పని చేస్తున్న పాకిస్తాన్?

praveen
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్ల పాలన కొన సాగుతోంది. ప్రపంచం మొత్తం ఈ తాలిబన్ల పాలనను వ్యతిరేకించింది అనే చెప్పాలి. అయితే మొన్నటి వరకు ప్రజాస్వామ్యం లో ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లకు పాలను నడిచింది అలాంటి సమయం లో ప్రపంచ దేశాలు అన్ని ఆఫ్ఘనిస్తాన్ కు అండగా నిలబడింది. ముఖ్యం గా భారత్అ యితే అన్ని రకాల సహాయ సహకారాలను అందించారు.  ఇలాంటి సమయం లో కేవలం ఒకే పాకిస్తాన్ మాత్రమే ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లకు మద్దతు ఇస్తూ వచ్చింది.

  ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్లకు పాలన రాగానే ఇక అన్ని దేశాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి విమాన రాక పోకలు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయ్. కానీ పాకిస్తాన్ మాత్రమే నిరంతరాయం గా ఆఫ్ఘనిస్తాన్ విమాన సర్వీసులు నడుపుతూ ఉండడం గమనార్హం. కానీ ఇటీవల మిత్ర దేశ మైన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాక్ ఇచ్చింది తాము ఆఫ్ఘనిస్తాన్కు పంపే అన్నిరకాల విమానాలను కూడా నిలిపివేస్తున్నాము అంటూ పాకిస్తాన్ ప్రకటన చేసింది. ఇది కాస్త హాట్ టాపిక్గా మారి పోయింది ఇక ఇప్పుడు మరో సారి పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

 మరో సారి ఆఫ్ఘనిస్తాన్కు విమానాలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల విమాన సర్వీసులను కూడా ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ కి నడుపుతాము అంటూ ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం చెప్పడం గమనార్హం. అయితే పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ తో గొడవ పెట్టుకుంటే పూర్తిగా రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని అందుకే పాకిస్తాన్ ఇలా కొత్త నాటకానికి తెర లేపింది అంటూ విశ్లేషకులు అంటున్నారు. 
గతంలో తాలిబాన్లు టిక్కెట్ల ధరలు తగ్గించాలి అంటూ డిమాండ్ చేశారు.  కానీ తాము టికెట్ ధరలు తగ్గించ లేము అంటూ విమానాలు నిలిపివేసిన పాకిస్తాన్.. విమానాలను నిలిపివేసింది. ఇప్పుడు విమానాలను పునరుద్ధరించిన పాకిస్తాన్   ఎప్పుడు టికెట్ ధరలు తగ్గిస్తుందా  లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: