నిజ‌మేనా? : ప‌వ‌న్ కోసం బాబు త్యాగం!

RATNA KISHORE

శ్రీ‌కాకుళం జెడ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి కాపుల‌కు ఇస్తే బాగుండు అనుకున్నారు కానీ కాలేదు. విజ‌య‌న‌గ‌రం మాత్రం అనుకున్న విధంగా జెడ్పీ స్థానం మ‌జ్జి శ్రీ‌ను పొందారు.ఈ లెక్క‌న చూసుకుంటే రెండు జిల్లాల‌కూ కాపులు అధికంగా ఉన్నా కూడా వైసీపీ ఇచ్చిన ఈక్వేష‌న్ల‌లో కాస్తో కూస్తో కాపుల‌కు మంచి ప్రాధాన్య‌మే వ‌చ్చింది. రెండు జిల్లాల‌కు సంబంధించి ఒక ఎంపీ (కాపు సామాజిక‌వ‌ర్గం) విజ‌య‌న గ‌రం పార్ల‌మెంట్ త‌ర‌ఫున ఉన్న‌ప్ప‌టికీ ఇంకా కాపులు త‌మ రాజ‌కీయ ప్రాధాన్యం విస్తారం కావాల‌నే కోరుకుంటున్నా రు. జ‌గ‌న్ మాత్రం అన్ని వ‌ర్గాల‌నూ క‌లుపుకుని పోవాల‌ని యోచిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపుల‌లో ఉన్న అసంతృప్తి ఏమ‌యినా ఉంటే దానిని త‌మ‌కు అనుగుణంగా మ‌లుచుకునే ప‌ని టీడీపీ చేయాల‌ని చూస్తోంది.


ఏ మాట‌కు ఆ మాట వైసీపీ ఈ సారి కాపు సామాజిక వ‌ర్గాన్ని బాగానే వాడుకుంది. త‌మ‌కు అనుగుణంగా ఓట్లు వేయించుకుని, సీట్లు ద‌క్కించుకుంది. కాపులకు పెద్ద‌గా చేసింది ఏమీ లేక‌పోయినా, ప‌ద‌వుల ప‌రంగా కాస్త తృప్తి ప‌రుస్తూనే ఉంది. ఈ పాటి శ్ర‌ద్ధ చంద్ర‌బాబు చూపినా కూడా కొంత ఫ‌లితం ఇచ్చేది. అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ కానీ చంద్ర‌బాబు కానీ కేవ‌లం ప‌ద‌వుల వ‌రకే వారిని ప‌రిమితం చేసి అధికారం త‌మ గుప్పిట గుంజుకున్నార‌న్న వాదన ఉన్నా కాపులు మాత్రం ఈ రెండు పార్టీలు త‌ప్ప ప్ర‌త్యా మ్నాయం వెతుక్కోలేక‌పోతున్నారు.


ఈ త‌రుణంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు కోసం ప‌వ‌న్, ప‌వ‌న్ కోసం బాబు అన్న విధంగా రాజ‌కీయం న‌డ‌వ‌నుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ - జ‌న‌సేన మిత్ర ద్వ‌యం పోటీ చేసేందుకు మొగ్గు చూపుతోంది. ముఖ్యంగా యాభై సీట్లు పొత్తుల్లో భాగంగానే క‌లిసి పంచు కుంటార‌ని, ప‌వ‌న్ పార్టీ కోసం అవ‌న్నీ ఇప్ప‌టికే రిజ‌ర్వు అయి ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ద‌శ‌లో చంద్ర‌బాబు మాత్రం ప‌వ‌న్ కోసం ఉత్త‌రాంధ్ర‌లో కూడా ఒక‌ట్రెండు కీల‌క స్థానాలు కేటాయించేందుకు, ఆయ‌న మ‌నుషులను గెలిపించుకునేందు కు చూస్తున్నారు. అతి పెద్ద ఓటు బ్యాంకు ఉన్న ప‌వ‌న్ ను త‌న‌వైపు తిప్పుకునేందుకు ముఖ్యంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లో ఆశించిన స్థానాల్లో గెలుపు సాధించేందుకు బాబు ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: