రేవంత్ ను అంత గట్టిగా నమ్ముతున్నారా...?

Gullapally Rajesh
తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఆ పార్టీకి జవసత్వాలు నింపడానికి చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెనుకబడి ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ పార్టీలో కొత్త జోష్ నింపడానికి పాదయాత్ర తో పాటుగా టిఆర్ఎస్ పార్టీ లేదా ఇతర పార్టీల నాయకులను తన పార్టీలోకి తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. రేవంత్ రెడ్డి విషయంలో కూడా కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ను ముందుకు నడిపించడానికి పాదయాత్ర కోసం సిద్ధమవుతున్న తరుణంలో వస్తున్న వార్తలు బాగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోష్ నింపుతున్నాయి అనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం ఉందని కొంతమంది మాజీ మంత్రులు అలాగే బిజెపి నాయకులు కూడా రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారని రేవంత్ రెడ్డి విషయంలో గత నెలరోజుల నుంచి నమ్మకం పెరిగింది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల విషయంలో పట్టు పెంచుకోవడంతో ఆయనతో సన్నిహితంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని భావంలో కూడా కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
అందుకే రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయి లో సహకారం అందిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పిన కార్యక్రమాలను వేగంగా చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాదయాత్ర విషయంలో పార్టీ అధిష్ఠానం తో చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. దీపావళి తర్వాత రేవంత్ రెడ్డి పాదయాత్ర కు రంగంలోకి దిగే అవకాశం ఉండొచ్చని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: