పొత్తు కుదిరేనా! : జగన్ కోసం జనం ?

RATNA KISHORE
ఎన్నో క‌ష్టాలు దాటి జ‌గ‌న్ సీఎం అయ్యారు. దాదాపు ప‌దేళ్లు జ‌నం మ‌ధ్య‌నే ఉండేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. పాద యాత్ర‌లు చేశారు. పాద‌యాత్ర‌లు చేయించారు కూడా! అంతేకాదు పార్టీని అధికారంలో తెచ్చేందుకు ఎన్నో అవ‌మానాలు భ‌రించారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌లు గ‌మ‌నించి, అప్ప‌టికే సీఎం హోదాలో ఉన్న బాబును కాద‌ని జ‌గ‌న్ ను ఎన్నుకున్నారు. కానీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక త‌ప్పుల మీద త‌ప్పులు చేశారు. రాజ‌ధాని రైతుల‌ను ప‌ట్టించుకోలేదు. మూడు రాజ‌ధానుల పేరిట పెద్ద డ్రామానే న‌డిపారు.


ఇదే ఇప్పుడు ఆయ‌న‌కు మైన‌స్ కానుంది. రాష్ట్ర రాజ‌ధాని రైతుల‌కు సంబంధించి అన‌రాని మాట‌లు అనిపించారు. ఇవ‌న్నీ జ‌గ‌న్ ను అప్ర‌తిష్ట పాల్జేశాయి. అధికారంలోకి రాగానే కృష్ణా క‌ర‌క‌ట్ట‌ల‌పై ఉన్న అక్ర‌మాలు అన్నీ తొల‌గిస్తాం అని చెప్పి, కేవ‌లం చంద్ర‌బాబు క‌ట్టించిన ప్ర‌జా వేదిక ను కూల్చి ఆనందం పొందారు. అటుపై జ‌గ‌న్ శ్ర‌ద్ధగా అక్ర‌మాల‌పై దృష్టి సారించిందే లేదు.



ఈ నేప‌థ్యంలో... జ‌నం ఎటువైపు?:
వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి వైసీపీ లో ఎన్నో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొందరు సీనియ‌ర్లు పోటీకి దూరం కానున్నారు. ఇంకొంద‌రిని జ‌గ‌నే ద‌గ్గ‌రుండి త‌ప్పించ‌నున్నారు. ఇదే సంద‌ర్భంలో ఇంకొంద‌రు పార్టీని వీడినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. కానీ జ‌గ న్ వెంట జ‌నం ఉంటారా లేదా అన్న సంశ‌యం ఒక‌టి వినిపిస్తుంది. ఎందుకంటే పాల‌న పరంగా ఇప్ప‌టికే జ‌గ‌న్ మంచి ప‌ట్టు పెంచుకోలేక‌పోతున్నారు. డ‌బ్బులు పంచ‌డ‌మే త‌న పాల‌న‌కు ప‌ర‌మావ‌ధి అని నిరూపిస్తున్నారు. ఆ విధంగా కాకుండా అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయిస్తే ఇంకొన్ని మంచి ప‌నులు జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌పై కానీ రోడ్లు నిర్మాణంపై కానీ జ‌గ‌న్ అస్స‌లు శ్ర‌ద్ధ వ‌హించ‌లేదు అన్న‌ది ఓ ఆరోప‌ణ. అదే నిజం కూడా! జ‌న‌సేన నేతృత్వంలో కొన్ని నిర‌స‌న‌లు జ‌రిగాక ద‌స‌రా త‌రువాత రోడ్డు ప‌నులు చేప‌డతామ‌ని ఇందుకు రెండు వేల రెండు వంద‌ల కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తామ‌ని చెప్పారు. ఆ ప‌నులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: