పొత్తు కుదిరేనా! : పవన్ బలపడలేదు కానీ...

RATNA KISHORE

చంద్ర‌బాబుతో గ‌తంలో పొత్తు కార‌ణంగా తాము న‌ష్ట‌పోయామ‌ని అస్స‌లు పోటీ చేయ‌కుండా ఆ ఎన్నిక‌ల్లో ఉండిపోవ‌డం త‌గ‌ద‌ని ఇప్ప‌టికీ ప‌వ‌న్ అభిమానులు అంటుంటారు. అయినా గ‌తంలో జ‌రిగిన త‌ప్పిదాలే మ‌ళ్లీ మ‌ళ్లీ చేయ‌డం మానుకోవాల‌ని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే క్షేత్ర స్థాయిలో ప‌నిచేసే శ్రేణులున్నా, నాయ‌క‌త్వ లోపం మాత్రం బాగానే ఉంది జ‌న‌సేన‌లో! ఉన్న నాయ‌కులంతా ప‌వ‌న్ తో ఫొటోల‌కు ఫోజులిస్తే, పార్టీ కార్యాచ‌ర‌ణ‌ను అమలు చేసే తామేం కావాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీ ప‌టిష్ట‌త‌పై ఎవ్వ‌రూ ఫోక‌స్ చేయ‌డం లేద‌ని అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ పొత్తులు ఎందుకు అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు.
ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రారంభించిన జ‌న‌సేన పార్టీ ఏడేళ్లు గ‌డుస్తున్నా ఇంకా బాలారిష్టాలు దాట‌లేక‌పోతోంది. కొన్ని స్థానిక స‌మ‌స్య‌ల‌పై పో రాటం సాగించినా, అది తుది వ‌ర‌కూ కొన‌సాగించ‌లేక‌పోయింది. గ‌త ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టుల‌తో వెళ్లిన‌ప్ప‌టికీ మంచి ఫ‌లితాలేవీ అందుకోలేక‌పోయారు. 2014 ఎన్నికల‌ప్పుడు మాత్రం పూర్తిగా పోటీకే దూరంగా ఉంటూ, టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చి, ప్ర‌చారం చేశారు ప‌వ‌న్. అయితే ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా సిద్ధంగా ఉండాల‌ని ఇటీవ‌లే ప‌వ‌న్ చెప్పిన‌ప్ప‌టికీ ఆ స్థాయిలో శ్రేణులు ప‌నిచేస్తాయా అన్న‌ది సందేహం. కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడినా, ఆ త‌రువాత వాటిపై మాట్లాడ‌కుండానే సైడ్ అయిపోయిన రోజులున్నాయి. ఈ త‌రుణంలో రానున్న ఎన్నిక‌లు ప‌వ‌న్ జీవితాన్ని ఎలా ప్ర‌భావితం చేయ‌నున్నాయి?
టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తే బాగుంటుంద‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తున్నా, కొంద‌రు మాత్రం ప‌వ‌న్ ను వ‌ద్ద‌నే వారిస్తున్నారు. గ‌తంలోనూ పొత్తుల కార‌ణంగానే న‌ష్ట‌పోయామ‌ని, అవ‌త‌లి పార్టీ వారికి అది ఎంతో లాభం చేకూర్చింద‌ని అంటున్నారు. 2014లో టీడీపీ, 2019లో వైసీపీ బాగానే లబ్ధి పొందాయ‌ని, క‌నుక పొత్తులు వ‌ద్దేవ‌ద్ద‌ని కొంద‌రు అభిమానులు వారిస్తున్నారు. ఇదే సంద‌ర్భం లో కొందరు త‌మ అధినేత ఏం చెబితే అదే పాటించేందుకు సిద్ధం అని అంటున్నారు. ఎవ‌రి అభిప్రాయం ఎలా ఉన్నా ప‌వ‌న్ ఈ సారి తెలుగుదేశంతోనే క‌ద‌ల‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: