విశాఖ దారుల్లో తెలంగాణ పోలీసు?

RATNA KISHORE
రెండు రాష్ట్రాల‌కూ ఇది కీల‌కం అనుకునే కేసు. రెండు రాష్ట్రాల‌కూ స‌వాలుగా మారుతున్న కేసు. వేల ఎక‌రాల్లో గంజాయి సాగు అవుతూ త‌రువాత అది ద్ర‌వ రూపంలో మారుతూ స‌రిహ‌ద్దులు దాటిపోతున్నా ప‌ట్టించుకోని యంత్రాంగం పై ఇదొక అభియోగం మాత్ర‌మే కాదు.. అప్ర‌మ‌త్తం అయ్యేందుకు చేస్తున్న హెచ్చ‌రిక కూడా! విశాఖ ఏజెన్సీలో అక్ర‌మార్కుల‌కు స్థానిక రాజ‌కీయ నాయ‌కుల అండ ఉంద‌న్న‌ది వాస్త‌వం. ఇదే లేకుంటే నిన్న‌టి వేళ పోలీసుల‌కు  తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న అన్న‌ది ఉండ‌నే ఉండ‌దు. ఇప్ప‌టికైనా గంజాయి సాగును, ర‌వాణాను స్థానిక రాజ‌కీయ నాయ‌కులు ప్రోత్స‌హించ‌కుండా ఉంటే మేలు అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.


గంజాయి స్మ‌గ్ల‌ర్లపై న‌మోద‌యిన కేసు ఒక‌టి ఛేదించే ప‌నిపై ఇక్క‌డికి వ‌చ్చారు తెలంగాణ పోలీసులు. కానీ సాయుధులై ఉన్న స్మ‌గ్ల‌ర్లు స్థానికుల సాయంతో రెచ్చిపోయారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై గాల్లోకి కాల్పులు జ‌రిపారు. పూర్తి సినీ ఫ‌క్కీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న రెండు రాష్ట్రాల పోలీసుల‌కూ క‌ల‌వ‌ర పాటుకు గురిచేసింది. స్థానికులు కొంద‌రు రాళ్ల దాడికి సైతం తెగ‌బ‌డ్డార‌ని త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో తాము ట్రాఫిక్ లో చిక్కుకుపోయామ‌ని ఇలాంటి త‌రుణంలో త‌ప్ప‌నిసరై, ఆత్మ ర‌క్ష‌ణార్థం గాల్లోకి కాల్పులు జ‌రిపామ‌ని న‌ల్గొండ ఎస్పీ చెబుతున్నారు.


విశాఖ దారుల్లో మ‌న్యం వీధుల్లో తెలంగాణ పోలీసులు హ‌ల్ చ‌ల్ చేశారు. ఓ కేసు విష‌య‌మై ఇక్క‌డికి వ‌చ్చిన పోలీసుల‌కు గంజా యి బ్యాచ్ చుక్క‌లు చూపెట్టారు. స్థానికుల స‌హ‌కారంతో వారిపైకి రాళ్లు రువ్వి గాయ‌ప‌రిచారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై గాల్లో కి కాల్పులు జ‌రిపారు. ప్రశాంత లంబ‌సింగిలో ఉద్రిక్త  వాతావ‌ర‌ణం నెల‌కొనండంతో ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అన్న ఆందోళ‌న అంతటా వ్య‌క్త‌మైంది. గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌ను అరెస్టు చేసి త‌మ ప‌రిధిలో న‌మోద‌యిన కేసును ఛేదిద్దాం అనుకున్న న‌ల్గొండ పోలీసుల‌కు వాళ్ళంతా అత్యంత పాశ‌విక చ‌ర్య‌లను చ‌వి చూపించారు. గొడ్డ‌ళ్ల‌తో దాడి చేసేందుకు సైతం వెనుకంజ వేయ‌లేదు. ఆఖ‌రికి ఈ త‌గాదాలో ఒక స్మ‌గ్ల‌ర్ కాలికి గాయ‌మైంది. ప్రాణ న‌ష్టం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: