నేను ఉండను అంటే ఉండను అంటున్న టీడీపీ మహిళా నేత...?

Gullapally Rajesh
తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో ఉన్న కొంత మంది నాయకులను పక్కన పెట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో పార్టీ కోసం పనిచేయని నాయకులను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని భావనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారని అందుకే కొంత మందిని పదవుల నుంచి పక్కన పెట్టడానికి రెడీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. ప్రధానంగా సొంత జిల్లా నాయకుల ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎప్పటినుంచో సీరియస్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆయన పుంగునూరు నియోజకవర్గానికి సంబంధించి ఆనీషా రెడ్డిని పక్కన పెట్టారు. దీనితో ఇప్పుడు ఆమె పార్టీలో కొనసాగే ఆలోచనలో లేరనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. 2019 ఎన్నికలకు ముందు ఎన్నో ప్రలోభాలు వచ్చినా సరే తన పార్టీ మారలేదని 2019 ఎన్నికల తర్వాత ఓటమిపాలైన సరే నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నానని ఆయన సరే తనను గుర్తించడం లేదని ఆవేదన ఆమెలో ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే పార్టీ మారేందుకు అధికార పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారని లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
పుంగనూరు నియోజకవర్గంలో ప్రత్యర్థి బలంగా ఉన్నా సరే తను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కష్టపడితే తనను ఈ విధంగా పక్కన పెట్టడాన్ని ఆమె ఏమాత్రం కూడా తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. చల్లా ధర్మారెడ్డి ని ఏవిధంగా ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా ముందు పెడతారు అని ఆమె ఆగ్రహంగా ఉన్నారట. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తాను పార్టీ కోసం ఎక్కువగా కష్టపడ్డానని అయినా సరే తనను గుర్తించలేదని  ఆనీషా రెడ్డి తీవ్ర బాధ లో ఉన్నారట. మరి పార్టీ అధిష్టానం ఆమెను పార్టీలో కొనసాగే విధంగా ముందుకు నడిపిస్తున్నదా లేకపోతే బయటకు పంపిస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: