జేసీ ఫ్యామిలీ బరువు దించుకుందా...?

Gullapally Rajesh
అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజులుగా జేసి దివాకర్ రెడ్డి కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. పార్టీలో చాలామంది నాయకులు వాళ్లకు సహాయ సహకారాలు అందించకపోవడంతో చాలా వరకు కూడా పార్టీ కార్యక్రమాలు చేసినా సరే పెద్దగా గుర్తింపు ఉండటం లేదు అనే అభిప్రాయం కూడా జేసీ దివాకర్ రెడ్డి లో ఎక్కువగా ఉందని జేసీ ప్రభాకర్రెడ్డి కూడా పార్టీలో ఉండటానికి ఇష్టపడటం లేదని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. ప్రధానంగా తమకు సహకరిస్తున్న చిన్న చిన్న నాయకులను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది జిల్లా నాయకులు ఇబ్బంది పెడుతున్నారని అభిప్రాయం కూడా జేసి దివాకర్ రెడ్డి లో ఉంది.
ఈ నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి కుటుంబం పార్టీకి సంబంధించి బరువు తగ్గించుకొనే ఆలోచనలో ఉందని త్వరలోనే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వారు చేపట్టబోయే కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకున్నారని పార్టీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. టిడిపి లోకి వచ్చిన తర్వాత తమ పట్టు పూర్తిగా కోల్పోయిన జెసి దివాకర్ రెడ్డి కుటుంబం ఇప్పుడు జిల్లా నాయకులు కూడా సహకారం అందించకపోవడంతో చాలావరకు నష్టపోయామనే భావనలో ఉన్నారు అని ప్రచారం జరుగుతోంది.
వారితో పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చర్చలు జరిపే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజం ఏంటనేది తెలియకపోయినా జేసి దివాకర్ రెడ్డి మాత్రం పార్టీలో కొనసాగడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని వచ్చేఎన్నికలలో పరిస్థితుల ఆధారంగా అవసరమైతే జనసేన పార్టీలో కూడా జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. పార్టీ అధినేత నుంచి క్షేత్ర స్థాయి నాయకత్వం వరకు తమను పక్కన పెట్టడం తో ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా వారి అనుభవానికి సరిపడవని కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండడం కరెక్ట్ కాదని భావిస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: