అవసరం అయితే ఢిల్లీ వెళ్దాం: బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

Gullapally Rajesh
రాయలసీమ లో వ్యవసాయం జీవనోపాధి.. వ్యవసాయానికి నీరు కావాలనే సదస్సు ఏర్పాటు చేసామని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఒకప్పుడు రతనాల సీమ... కరవు సీమ గా ఉండడం తోనే అభివృద్ధికి నాన్న గారు కృషి చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. సీమ లో బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి హంద్రీనీవా ను తెచ్చారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మద్రాసు కు నీరు ఇవ్వడానికి తెలుగు గంగ ను తెచ్చారు అని ఈ ప్రభుత్వానికి హంద్రీనీవా నుంచి కనీసం చెరువులకు నీరు అందించే ఆలోచన లేదు అని విమర్శించారు.
నీరు నిర్విరామంగా ప్రవహిస్తున్న పూర్తీ స్థాయిలో చెరువులకు నీరు అందించలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేసారు. హంద్రీనీవా కింద ఆయకట్టు కు నీరు ఇవ్వలేదు.. గత ఏడాది నీళ్లు వచ్చినా ఇదే పరిస్థితి అని ఆయన ఆరోపణలు చేసారు. అనంతపురం పరిస్థితి ఏమిటి.. సీమకు నీళ్లు అందించే బాధ్యత ను టీడీపీ తీసుకుంది అని బాలయ్య ప్రస్తావించారు. ఈ రోజు పరిస్థితి అధ్వాన్నంగా మారింది అన్నారు ఆయన. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు అని వ్యాఖ్యలు చేసారు.  నీళ్లు లేవా ఇవ్వాలన్న ఆలోచన ప్రభుతానికి లేదు అని విమర్శించారు.
బీటీ ప్రాజెక్టుకి, చెరువులకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని జిల్లాలో అన్ని చెరువులకు నీరు అందించాలి... కరవు పోయేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు. గోదావరి, పెన్నా అనుసంధానం జరగాలన్నారు ఆయన. సీమ కు నికర జలాలు వినియోగించాలి అని కోరారు. నిర్లక్షానికి గురైన ప్రాంతాన్ని అభివృద్ధి లోకి తెచ్చేందుకు ఎన్ఠీఆర్, చంద్రబాబు నీళ్లు ఇచ్చేందుకు కృషి చేశారు అని వివరించారు. సీమ నీటి కోసం అవసరమైతే ఢిల్లీ కి వెళ్లి పోరాటం చేద్దాం అని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: