నన్ను ఖాతం చేయాలని కుట్ర జరుగుతుంది: ఈటెల సంచలనం

Gullapally Rajesh
హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు. నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు తప్ప...కేసీఆర్ రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు అని ఆయన ఆరోపణలు చేసారు. ఇప్పటికే వర్షాలకు ధాన్యం తడిసిపోతోంది అని వెంటనే కొనుగోళ్లు చేయండి అంటూ డిమాండ్ చేసారు. తడిసిన ధాన్యం కూడా కొనాలి అని కోరారు. మాటల్లో రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్నా... చేతల్లో మాత్రం రైతు వ్యతిరేకం అని విమర్శించారు. వరి తప్ప వేరే ఇతర పంటలు హుజురాబాద్ లో లేవు అని అన్నారు.
గతంలో వరి కొనబోమని సీఎం కేసీఆర్ అంటే... నేను కొనాల్సిందేనని చెప్పాను అని గుర్తు చేసారు. మాట మాట్లాడితే డబ్బులకు కొదవలేదని.. రిచెస్ట్ స్టేట్ అని సీఎం చెబుతుంటాడు అని కానీ మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ  కూడా రిలీజ్ చేయలేని దద్దమ్మ ప్రభుత్వమిది అని అంటూ ఆయన విమర్శలు చేసారు. హుజురాబాద్ ఎన్నికల కోసం మాత్రమే ఇక్కడి మహిళలకు వడ్డి బకాయిలు, రుణాలు మంజూరు చేసారు అని అన్నారు. దళితబంధు,ఫించన్లు, కొత్త రేషన్ కార్డులన్నీ నావల్లే ఇక్కడ వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.

 
ఈటెల రాజేందర్  అనే వాడు ఏకుమేకైండని.. నన్ను ఖతం పట్టించాలని కుట్రలు చేస్తున్నాడు అని విమర్శించారు. నా ముఖం అసెంబ్లీలో కనిపించకూడదని.. ప్రగతిభవన్ లో కూర్చుని అల్లుడు హరీశ్ కు కేసీఆర్ ఆదేశాలిచ్చాడు అని వందల కోట్ల రూపాయలు, లారీల్లో లిక్కర్ సీసాలు, రాజస్థాన్ నుంచి పదివేల గొర్రెలు తెచ్చాడట అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. మనమేమైనా గొర్రెల్లెక్క కనిపిస్తున్నామా? హుజురాబాద్ ప్రజలు చేవ, సత్తా, రోషం ఉన్నోళ్లు అన్నారు ఆయన. పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే బిడ్డలు మావాళ్లు అని సీడ్ పండించడంలో మా రైతులున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్ప.. దౌర్జన్యానికి లొంగరని ఈనెల30న జరిగే ఎన్నికల్లో నిరూపిస్తారు అని ఆయన కామెంట్ చేసారు. చేతనైనోడైతే.. తమ గురించి చెప్పుకుని ఓట్లు అడుగుతాడు అని చేతగానోడు దొంగదెబ్బ కొట్టాలని చూస్తాడు అంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: