క‌డ‌ప జిల్లాలో వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యే షాకులు... జ‌గ‌న్‌కు దెబ్బే..!

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో అధికార పార్టీకి ఇప్పుడు వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌గిలే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. సీఎం జ‌గ‌న్ కు క‌డ‌ప సొంత జిల్లా. ఇక్క‌డ ముందు నుంచి కూడా అధికార పార్టీకి చెందిన నేత‌లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే వారంద‌రికి కూడా ప‌ద‌వులు ఇవ్వ‌డం జ‌గ‌న్ వ‌ల్ల కావ‌డం లేదు. దీంతో రో జు రోజుకు పార్టీలో అసంతృప్త నేత‌ల సంఖ్య పెరిగి పోతోంది. దీంతో అక్క‌డ ప‌ద‌వులు రాని వారు ఈ రెండున్న రేళ్లుగా వెయిట్ చేసి వెయిట్ చేసి చివ‌ర‌కు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తోన్న ప‌రిస్థితి.

ఈ క్ర‌మంలోనే క‌డ‌ప జిల్లా నుంచి ప‌లువురు కీల‌క నేత‌లు టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈనెల 20న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు జమ్మలమడుగుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి రెడీ అవుతున్నారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఆయ‌న తో పాటు ఆయ‌న త‌న కుమారుడితో కలసి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ప్రకటించించారు. జమ్మలమడుగులో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని నారాయ‌ణ రెడ్డి చెప్పారు.

ఇక అదే క‌డ‌ప జిల్లా లో వైసీపీ కంచుకోట గా ఉన్న విప్ శ్రీకాంత్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం రాయచోటికి చెందిన బలమైన వైసీపీ నేత త్వరలో టీడీపీ గూటికి చేరుతున్నారు. ఆ నేత ఇప్ప‌టికే టీడీపీ ట‌చ్ లోకి వెళ్లిపోయారు. చంద్ర‌బాబు కూడా ఆయ‌న చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఇక మాజీ మంత్రి డి.ఎల్.రవీంద్రనాథ్ రెడ్డి కూడా జ‌గ‌న్ పై ఇటీవ‌ల తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న కూడా టీడీపీ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌.

ఇక గ‌త సార్వ‌త్రిక  ఎన్నికల అనంతరం వైసీపీలో చేరిన మాజీమంత్రి రామసుబ్బారెడ్డి కూడా అధినేత పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్‌. ఓవ‌రాల్ గా క‌డ‌ప జిల్లా కుచెందిన ఈ కీల‌క నేత‌లు అంద‌రూ ఇప్పుడు టీడీపీలో చేరేందుకు రెడీ అవుతుండ‌డం జ‌గ‌న్‌కు పెద్ద షాకే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: