పెట్రోల్‌, డీజిల్‌ ధ‌ర‌లు ఎలా త‌గ్గుతాయి..?

Paloji Vinay
దేశ‌వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌లు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుల‌పై పెనుభారం ప‌డుతోంది. ఆకాశ‌న్నంటుతున్న వీటి ధ‌ర‌లు త‌గ్గాల‌ని అందరూ కోరుకుంటున్నారు. నిపుణ‌ల అంచ‌నాల ప్ర‌కారం ఇంధ‌న ధ‌ర‌ల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకువ‌స్తే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని చెబుతున్నారు. చాలా కాలం నుంచి పెట్రోల్‌, డీజిల్ ను జీఎస్‌టీ ప‌రిధిలోకి చేర్చాల‌నే చ‌ర్చ సాగుతోంది. కానీ, దీనిపై కేంద్ర, రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఇంకా అంగీకారం తెలుప‌లేవు.. దీంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇంకా జీఎస్‌టీ ప‌రిధిలో చేర్చ‌లేరు.

  వీటి ధరలను జీఎస్‌టి పరిధిలోకి తీసుకురావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం నిరంత‌రం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ రాష్ట్రాల సహాయం లేకుండా ఇది అస్సలు సాధ్యపడదని కేంద్ర ప్రభుత్వం వెల్ల‌డిస్తోంది.  దీని ఫలితంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు తాజాగా పలు రాష్ట్రాల్లో రూ.110 కి చేరుకున్నాయి.  పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతుండ‌డంతో ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాలు తీవ్ర ఆందోళ‌న చేస్తున్నారు.  ప్ర‌స్తుతం.. పెట్రోల్‌, డీజిల్ పై 60 శాతం ప‌న్నుగా వ‌సూలు చేస్తున్నారు. దీంట్లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత‌వాల‌కు వాటా ఉంటుంది.

  ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజిల్ ను జీఎస్‌టీ ప‌రిధిలోకి తీసుకువ‌స్తే, వాటిపై చెల్లించే ప‌న్ను త‌గ్గుతుంది. జీఎస్‌టీ నిబంధ‌న‌ల ప్ర‌కారం గ‌రిష్ట ప‌న్ను 28 శాతం మాత్ర‌మే ఉంటుంది. దీంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌లో 28 శాతం వ‌ర‌కే ప‌న్ను ప‌డుతుంది. దీంతో దాదాపు 40 శాతం వ‌ర‌కు పెట్రోల్‌, డీజెల్ రేట్లు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. నివేదిక ప్ర‌కారం జీఎస్టీలోకి వ‌చ్చిన త‌రువాత పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు వ‌రుస‌గా రూ. 30 , రూ.20 వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని తెలుస్తోంది. జీఎస్టీ ప‌రిధిలోకి పెట్రోల్‌, డీజీల్ ల‌ను తీసుకు వ‌స్తే మొద‌ట‌గా న‌ష్ట‌పోయేది రాష్ట్రాలు వాటి ప్ర‌భుత్వాల‌ని తెలుస్తోంది. అందువ‌ల్ల‌నే జీఎస్టీ ప‌రిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌ను చేర్చేందుకు రాష్ట్రాలు అభ్యంత‌రాలు తెలుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: