హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ప్లాన్ ఇదే.. వర్కవుట్ అయ్యేనా..?

Chakravarthi Kalyan
హుజూరాబాద్ ఉపఎన్నిక.. ఇప్పుడు తెలంగాణలో నేతలందరి దృష్టీ దీనిమీదే ఉంది. తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు మాదే అని చెప్పుకునే టీఆర్ఎస్‌ ఈసారి కూడా ఆ మాట నిరూపించుకుంటుందా.. టీఆర్ఎస్‌ నుంచి దాదాపు గెంటివేయబడిన ఈటల రాజేందర్.. తన సత్తా చాటుకుంటాడా.. టీఆర్ఎస్‌కు ప్రత్యేకించి జలక్ ఇస్తాడా అన్నది తేలాల్సిన విషయం. ఈటల బీజేపీ నుంచి బరిలో దిగడం.. సీన్ కాస్తా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా మారడం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

అయితే.. హుజూరాబాద్‌ బరిలో లేటుగా దిగినా.. లేటెస్టుగా సత్తా చాటతామంటోంది కాంగ్రెస్.. ఆ పార్టీకి ఇక్కడ గెలుపుపై పెద్దగా ఆశలు లేవు.. ఆ పార్టీకి కూడా పెద్దగా ఆశలు లేవు.. అయితే.. తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ సీన్‌లోకి వచ్చాక కాస్త ఊపు పెరిగింది. అందుకే హుజూరాబాద్‌లోనూ  గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకుని సత్తా చాటాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకు తగిన వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అయితే అభ్యర్థి ఎంపికలోనే చాలా రోజులు గడిపేసిన కాంగ్రెస్.. ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.

ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశం నిర్వహించుకుంది. ఈ జూమ్ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు జగ్గారెడ్డి, మల్లు రవి, అభ్యర్థి బలమూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో దాదాపు  80 మందికిపైగా  నియోజకవర్గ  ఇన్చార్జులు, మండల ఇంచార్జిలు, గ్రామ ఇంచార్జిలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు.

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటి గ్యాస్ వంటి సమస్యలతో పాటు ఇతర ప్రజావ్యతిరేక కార్యకలాపాలను జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని శ్రేణులకు పిలుపు ఇస్తోంది. ప్రధానంగా విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలను పరిష్కారంలోనూ ప్రభుత్వ వైఫల్యం చెందంటున్న నేతలు.. ఆ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. తెరాస, బిజెపిల ఢిల్లీ దోస్త్, గల్లీ కుస్తీలను  కూడా జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ దిశా నిర్దేశం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: