చినబాబు సీటులో ట్విస్ట్‌లు...చివరికి ఆ సీటు ఫిక్స్?

M N Amaleswara rao
రాజకీయాల్లో గెలుపోటములు సహజం....ఓటమి గెలుపు తొలిమెట్టు అనుకుని నాలుగు సూత్రాలని చెప్పుకుంటూ రాజకీయ నేతలు ముందుకెళ్లాలి...అలా కాకుండా ఏవో విమర్శలు వస్తున్నాయని వాటిని పట్టుకుని వేలాడితే ఇబ్బంది అవుతుంది...అందుకే ఆ పని నారా లోకేష్ చేస్తున్నట్లు లేరు. తొలిసారి ఎన్నికల బరిలో దిగి లోకేష్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మంగళగిరి బరిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
అయితే ఓడిపోయాక లోకేష్ వెంటనే సెట్ అయిపోయారు. ప్రత్యర్ధులు ఓడిపోయావని ఎగతాళి చేసిన కూడా లోకేష్ త్వరగానే పుంజుకున్నారు. గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంతో పాటు తాను కూడా గెలవాలని లోకేష్ చూస్తున్నారు. అయితే లోకేష్ ఈ సారి ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారనే అంశమే కాస్త ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే లోకేష్...మంగళగిరిలో పోటీ చేస్తారని ఆ పార్టీ శ్రేణులు ఫిక్స్ అవుతున్నాయి. కానీ లోకేష్ ఈ సారి సీటు మార్చేస్తారని విశ్లేషకులు...తమ విశ్లేషణలని చెబుతున్నారు. ఈ సారి లోకేష్ కుప్పం బరిలో దిగుతారని, చంద్రబాబు వేరే చోటకు షిఫ్ట్ అయ్యి, లోకేష్‌ని సేఫ్‌గా కుప్పం బరిలో పెడతారని అక్కడైతే లోకేష్ గెలుస్తారని అంటున్నారు. ఇక కుప్పం కాకుండా...విశాఖ నగరంలో ఏదొక సీటులో లోకేష్ పోటీ చేయొచ్చని, లేదంటే భీమిలి నియోజకవర్గంలో పోటీ చేస్తారని చెప్పి ప్రచారం కూడా నడుస్తోంది.
కానీ చినబాబు సీటు విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మళ్ళీ మంగళగిరిలోనే చినబాబు పోటీ చేస్తారని పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చ నడుస్తోంది. ఎక్కడైతే ఓటమి పాలయ్యారో అదే సీటులో గెలవాలనే పట్టుదలతో లోకేష్ ఉన్నారని, సేఫ్‌గా మాత్రం వేరే సీటులోకి వెళ్లరని చెబుతున్నారు. ఇప్పటికే మంగళగిరిలో టి‌డి‌పికి అనుకూలమైన వాతావరణం వస్తుంది. పైగా రాజధాని అంశం బాగా ప్లస్ కానుంది. అక్కడ ప్రజలు వైసీపీతో బాగా నష్టపోయి ఉన్నారు. అందుకే ఈ సారి వాళ్ళు లోకేష్‌ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మొత్తానికైతే చినబాబు మళ్ళీ మంగళగిరి బరిలోనే దిగుతారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: