రేవంత్ మాట : తరువాతి సీఎం కేటీఆర్‌..?

Paloji Vinay
  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంలో రేవంత్ రెడ్డిని మించిన వారెవ‌రూ ఉండ‌రేమో. అయితే, రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్య‌ల్లో నిజం కూడా ఉంటుంద‌నేది వాస్త‌వం. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక అంశంలో తెలివిగా మంత్రి కేసీఆర్ జార‌కుంటున్నాడు. కానీ, మంత్రి హ‌రీష్‌రావు ఇరుక్కుపోయారు. సీఎం కేసీఆర్ అప్ప‌జెప్పిన ప‌నిని హ‌రీష్‌రావు త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకున్నారు. పార్టీ గెలుపు కోసం పోరాడుతున్నారు. రాత్రన‌క ప‌గ‌ల‌న‌క ప్ర‌చారంలో పాల్గొంటు.. పార్టి విజయానికి త‌న శాయ శ‌క్తుల కృషి చేస్తున్నారు. కాగా,  హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో హ‌రీష్ రావు బ‌క‌రా అవుత‌ర‌నే రేవంత్ వ్యాఖ్యానించారు.


ఇప్పుడు ఆ వ్యాఖ్య‌లు నిజమ‌య్యేలా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కేటీఆర్ ను సీఎం చేయాల‌ని కేసీఆర్ నిదానంగా హ‌రీష్‌రావును సైడ్ చేస్తున్నార‌ని తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌చారం సాగుతోంది. అయితే, ఆ ప్ర‌చారానిక త‌గ్గ‌ట్టుగానే కొన్ని కీల‌క ప‌రిణామాలు జ‌రిగాయి. దానికి త‌గ్గ‌ట్లే కేసీఆర్ ఉప ఎన్నిక గెలుపు బాధ్య‌త‌ను హ‌రీష్‌రావుపై వేశారు. హుజురాబాద్ గెలుపు బాధ్య‌త‌ను మొత్తం తానై ముందుకు న‌డిపిస్తున్నాడు. అయితే,  హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలిస్తే ఫ‌ర్వాలేదు. అప్పుడు ఆ క్రెడిట్ హ‌రీష్‌రావుకే కాకుండా అంద‌రూ తీసుకుంటారు. ప్ర‌భుత్వం అభివృద్దే విజ‌యానికి కార‌ణ‌మ‌ని చెబుతారు.  

 ఒక వేళ ఈ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ ఓడిపోతే బ‌ల‌య్యేది మంత్రి హ‌రీష్‌రావు అని అర్థ‌మ‌వుతుంది. ఓట‌మికి కార‌ణం హ‌రీష్‌రావు అని చేతులు దులుపుకునే అవ‌కాశం ఉంది. అందుకే కేటీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో కేటీఆర్ పెద్ద‌గా క‌లుగ‌జేసుకోవ‌డం లేదు. ఇక కేసీఆర్ సైతం తెర‌వెనుక ఉంటున్నారు గాని డైరెక్టుగా రంగంలోకి దిగడం లేదు. అస‌లు కేటీఆర్ అయితే హుజురాబాద్ మొహం కూడా చూడ‌డం లేదు.


హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం త‌మ‌కు చిన్న విష‌యం అంటూ చెప్పుకొచ్చారు. ప్ర‌చారానికి వ‌చ్చినా ఒక రోజుకు ప‌రిమ‌త‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది.  హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే ఆ ఓట‌మిని హ‌రీష్‌రావు పై వేసి రేవంత్ రెడ్డి అన్న‌ట్టుగా కేటీఆర్ నే సీఎం చేస్తారా అనే మాట‌లు వినిపిస్తున్నాయి. కేటీఆర్ అంటే టీఆర్ఎస్ లో మంచి పేరు ఉండ‌డంతో సీఎం చేసినా వ్య‌తిరేకం ఉండ‌ద‌ని అర్థ‌మ‌వుతుంది.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: