అరుదైన ఫీట్ కోసం కేంద్రం ఏర్పాట్లు..!

NAGARJUNA NAKKA
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 100కోట్లకు పైగా డోసులు ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. అన్ని డోసులు ఉచితంగానే ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. అన్ని డోసులు ఉచితంగానే ఇచ్చామనీ.. ఇంకా 10.53కోట్ల టీకా డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల దగ్గర అందుబాటులో ఉన్నాయంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి దేశంలోని 18ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామంది.
దేశంలో వంద కోట్ల డోసుల పంపిణీ ఫీట్ ను అక్టోబర్ 18లేదా 19నాటికి చేరుతామని కేంద్రమంత్రి మనసుఖ్ మాండవీయ అన్నారు. 100కోట్ల డోసుల పంపిణీ పూర్తయ్యాక దేశంలోని రైల్వే, మెట్రో స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, బస్టాండ్ లు, ఓడరేవుల్లో ప్రకటన చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బందిని సన్మానిస్తామన్నారు. కేంద్రమంత్రులూ వేడుకల్లో భాగమయ్యే అవకాశాలున్నాయన్నారు. 100శాతం వ్యాక్సినేషన్ పూర్తయిన జాబితాలో జమ్ము,కాశ్మీర్ చేరింది అని ఆయన అన్నారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో 2 నుంచి 18ఏళ్ల మధ్య వయస్కులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్టు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం 18ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కోరనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక కరోనాపై పోరాటం చేస్తున్న ఆరోగ్యశాఖ.. అధికారుల కొరతను ఎదుర్కొంటోంది. తాము ఒత్తిడిలో ఉన్నామనీ.. దయచేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరింది. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోనే ఉందనీ.. అలా అని మహమ్మారిపై పోరాటాన్ని ఆపలేమని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించింది. ఉద్యోగాలు ఖాళీగా ఉండటంతో ఒత్తిడికి గురవుతున్నామని చెప్పింది ఆరోగ్య శాఖ.
అటు అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణీకులపై గతంలో విధించిన ఆంక్షలను సడలించింది. టీకా రెండు డోసులు తీసుకున్న విదేశీయులను నవంబర్ 8 నుంచి తమ దేశంలోకి అనుమతిస్తామని.. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న స్వదేశీయులు కూడా దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చంది. కరోనా కారణంగా కెనడా, మెక్సికో దేశాలతో ఉన్న సరిహద్దులను అమెరికా గతంలో మూసివేయగా.. తాజాగా వాటిపై ఆంక్షలను తొలగించింది.  




 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: