జగన్ కి సొంత ఇలాకాలో షాక్... ?

Satya
ఏపీలో రాజకీయాలు ఎపుడూ హీట్ గానే ఉంటాయి. అసలు గత కొన్నేళ్ళుగా చూస్తూ ఉంటే ఎక్కడా ఎవరూ తగ్గడంలేదు. ఎన్నికలు ఈ రోజా రేపా అన్నట్లుగానే సవాళ్ళు, ప్రతి సవాళ్ళూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే జగన్ సీఎం అయ్యాక ఆయన సొంత గడ్డ రాయల‌సీమలోనే రెండు ఉప ఎన్నికలు వచ్చాయి.
అందులో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ మంచి మెజారిటీతో గెలిచింది. ఇక ఇపుడు ఏకంగా జగన్ సొంత జిల్లా కడప‌ ఇలాకా బద్వేల్ లో ఉప ఎన్నిక ఉంది. ఇదిలా ఉంటే జగన్ కి కంచు కోట లాంటి చోట కూడా ఏకగ్రీవం కాకుండా పోటీ జరుగుతోంది. టీడీపీ రేసు నుంచి తప్పుకున్నాక కొడా పోటీ తప్పలేదు. ఆ సంగతి అలా ఉంచితే ఇపుడు అదే సొంత జిల్లా కడప నుంచి ఒక ధిక్కార స్వరం వినిపించింది. ఆ స్వరం ఎవరితో కాదు, ఆయన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. గట్టిగా ఒక్క మాట ఆయన గురించి చెప్పాలీ అంటే ఆయన వైఎస్సార్ కాలం నాటి వారు. ఆయనకు సమకాలీనుడు.
ఇక వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు ఆయన అసమ్మతివాదిగానే ఉన్నారు. జగన్ తోనూ నాడు విభేదించారు. ఆ మధ్యలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారారు. ఇక చిత్రంగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. జగన్ తో పాటు కడపలో అనేక సభలల్లో కనిపించారు. వైసీపీ ఎమ్మెల్యేల విజయం వెనక ఆయన కృషి ఉందని అంటారు. ప్రత్యేకించి ఆయనది మైదుకూరు. అక్కడ ఆయనకు బాగానే బలం ఉంది.
సరే డీఎల్ జగన్ కి మద్దతు ఇచ్చిన దాని వెనక ఒక వ్యూహం ఉంది. ఆయన తనకు సముచిత స్థానం కోరుకున్నారు. కానీ సగం పాలన ముగిసింది కానీ జగన్ ఆయన వైపు చూడలేదు. దాంతో ఇక జరిగేది కూడా తెలిసినట్లుంది. అందుకే ఆయన గొంతు సవరించుకున్నారు. జగన్ సర్కార్ మీద గట్టిగానే విరుచుకుపడ్డారు. ఏకంగా జగన్ మీదనే బాణాలు వేశారు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాను అంటున్నారు. మరి ఆయన అయితే వైసీపీలో ఉండరు అన్నది కన్ ఫర్మ్. మరి టీడీపీలో చేరుతారా అంటే అదే నిజం అనుకోవాలేమో. మొత్తానికి ఒక వైపు బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతున్న వేళ ఈ సీనియర్ నేత జగన్ కి భారీ షాక్ ఇచ్చేశారు అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: