ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యేలకు ఈ సారి కష్టమేనా?

M N Amaleswara rao
గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గం నాయకుల హవా ఎక్కువ... జిల్లాలో ఉన్న 17 సీట్లలో 9 చోట్ల కమ్మ నాయకులే బాధ్యతలు చూసుకుంటున్నారంటే పరిస్తితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. మంగళగిరిలో నారా లోకేష్, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర, తెనాలిలో ఆలపాటి రాజా, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, వినుకొండలో జి‌వి ఆంజనేయులు, సత్తెనపల్లిలో కోడెల శివరాం, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్‌, గుంటూరు వెస్ట్‌లో కోవెలమూడి రవీంద్ర బాబులు ఉన్నారు.
అంటే గుంటూరులో కమ్మ నేతల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే టి‌డి‌పిలో బలంగా ఉన్న కమ్మ నేతలని ఓడించేందుకు గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ తరుపున కూడా కమ్మ నేతలని బరిలోకి దింపారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, పెదకూరపాడులో నంబూరు శంకర్ రావు, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడులని పోటీకి దించారు. ఇక ఈ ముగ్గురు జగన్ గాలిలో గెలిచేశారు. పైగా వైసీపీ కూడా అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి రెండున్నర ఏళ్ళు అవుతున్నా సరే ఈ కమ్మ ఎమ్మెల్యేలు పెద్దగా హైలైట్ అవ్వలేదనే చెప్పొచ్చు.

అలాగే వీరి పనితీరుకు కూడా మంచి మార్కులు పడుతున్నట్లు కనిపించడం లేదు. ఇటు బొల్లా ఎక్కువ వివాదాల్లో ఉంటున్నారు. దీని వల్ల ఆయనకు బాగా మైనస్ ఉంది. అటు ప్రత్యర్ధిగా ఉన్న టి‌డి‌పి నేత జి‌వి ఆంజనేయులు పుంజుకున్నారు. దీంతో వినుకొండలో ఈ సారి బొల్లాకు షాక్ తగిలేలా ఉంది. అటు తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్‌కు కూడా అంతగా మంచి మార్కులు ఏమి పడటం లేదు. ఇక్కడ టి‌డి‌పి నేత ఆలపాటి రాజా స్ట్రాంగ్ అయ్యారు. పైగా రాజధాని అమరావతి అంశం బాగా ప్లస్ అవుతుంది. ఇటు పెదకూరపాడులో శంకర్ రావు పర్వాలేదనిపిస్తున్నారు. ఈయనకు పోటీగా ప్రత్యర్ధి శ్రీధర్ సైతం పికప్ అవుతున్నారు. మొత్తానికి చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురు వైసీపీ కమ్మ ఎమ్మెల్యేలు కాస్త కష్టపడేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: