పాకిస్తాన్ కల.. అప్పులతో విలవిలా.. !

Chandrasekhar Reddy
భారత్ పై గెలిచి ఏదో సాధించినట్టు ఆనందపడాలని పాక్ ఆశ లేదా కల. దానికోసం ఎవరెవరితోనే చేతులు కలిపింది, ఇంకెవరితోనో స్నేహం చేసింది, చివరికి ఏమైంది, ఉప్పుపప్పు కూడా లేకుండా పోతుంది. ప్రస్తుతం పాక్ ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయింది. దాదాపు ఆఫ్ఘన్ పరిస్థితి ఏమిటో పాక్ పరిస్థితి కూడా అదే తరహాలో ఉంది అని చెప్పేయవచ్చు. అయితే అక్కడ పాపమో భారత్ పై పెంచుకున్న తరగని పగనో పాక్ ను ఈ స్థితికి తెచ్చాయంటే నమ్మాలి. కానీ అసలు కారణం మాత్రం వేరే. కేవలం చైనాతో చేతులు కలిపి అదేమీ చెప్పినా చేసేసిన పాక్ ఇప్పుడు కూడా దానినే నమ్ముతూ ఇంకా పాతాళానికి పడిపోతూనే ఉంది.
ఈ స్థితిలో కూడా పాక్ భారత్ పై ఊగిపోతోంది తప్ప చైనా వలననే తాను ఇలా అయినట్టు మాత్రం అర్ధం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. వీలైతే తమ స్థితికి భారత్ మాత్రమే కారణం అని అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత కసి భారత్ అంటే పాక్ కి. అంతగా దానికి చేసిన అన్యాయం ఏమిటో కూడా ఆ దేశానికి తెలుసోలేదో..! ప్రస్తుతం మాత్రం పాక్ అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ప్రపంచంలో కొన్ని దేశాలు ఈస్థితిలో ఉండటానికి కారణం కరోనా అయితే పాక్ మాత్రం ఇలా ఉండటానికి కేవలం చైనా మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. పాక్ ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది, లేదంటే పరిస్థితి ఇంకా దిగజారిపోగలదు అంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక అప్పులలో ఉన్న పది దేశాలలో పాక్ ఒకటి అని ప్రపంచ బ్యాంకు నివేదికలో తేలింది. ఇప్పటికే పాక్ కు ప్రపంచం ఆర్థికంగా సాయం చేయడానికి వెనకడుగు వేస్తుంది. ఈ నివేదిక తో ఇక ఎవ్వరు కూడా పాక్ కు అప్పు ఇచ్చే పరిస్థితి మాత్రం ఉండబోదు. ఈ పది దేశాలు చేసిన అప్పులు 509 బిలియన్ డాలర్లుగా ఉంది. అందుకే వీళ్లకు అప్పులు ఇక పుట్టే అవకాశం లేదు, వీళ్లు బయట ప్రైవేట్ గా లోన్ లు తీసుకోవాల్సిందే. అంటే పాక్, చైనా వద్ద తీసుకున్నట్టుగా, దానికి వడ్డీ రేటు ఎంతైనా ఉండొచ్చి, కానీ చైనా ఆ విషయం ఎప్పుడు బహిర్గతం చేయలేదు. పాక్ కూడా చైనాను అప్పులు తీర్చే పరిస్థితి లేదు, మాఫీ చేయాలనీ అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఒక్క ఎకనామిక్ కారిడార్ కింద పాక్ చైనా నుండి తీసుకున్నదే 22వేల కోట్లు, అవి కూడా ఇమ్రాన్ ఖాన్ మాఫీ చేయాలనీ కోరగా, చైనా చేయలేదు. ఇప్పుడు పాక్ లో సామాన్యుల జీవన స్థితిగతులు ఆఫ్ఘన్ ల కంటే మెరుగ్గా ఏమిలేవని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: