నీళ్ళ పంచాయితీ తెలేనా...? గెజిట్ అమలు జరుగునా...?

Sahithya
రెండు తెలుగు రాష్ట్రాలు కొట్టుకుని సమస్యను కేంద్రం వద్ద పెట్టడం తో కేంద్రం జలవనరుల విషయంలో తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయంగా కూడా ఇది వివాదాస్పదంగా మారడం మనం చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రం అనుసరించే వైఖరి కూడా చికాకుగా ఉందనే మాట అర్ధమవుతుంది. కేంద్రం... రెండు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్ట్ లను తన పరిధిలోకి తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల తీవ్ర స్థాయి విమర్శలు చూసాం. అయితే కృష్ణా,గోదావరి బోర్డు ల గెజిట్ అమలుపై డైలమా నెలకొంది.
నేటి నుండి రెండు రాష్ట్రాలలోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకుంటామని గతంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర జలశక్తి... గెజిట్ అమల్లో భాగంగా గోదావరి పై పెద్దవాగు, కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, రెగ్యులేటర్స్ ను తమ పరిధిలోకి తీసుకుంటామని  బోర్డులు ప్రకటన చేసాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా బోర్డు పరిధిలోకి ఇవ్వాలని కేఆర్ఎంబి కోరింది. బోర్డుల నుంచి మినిట్స్ కాపీలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు. విద్యుత్ ప్రాజెక్టులు బోర్డు కు ఇచ్చేందుకు తెలంగాణ విముఖత వ్యక్తం చేసింది.
 బోర్డులు అందజేసిన మినిట్స్ కాపీపై అధ్యయనం చేసేందుకు ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణా.  ఈఎన్సీ మురళీధర్ రావు ఆద్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంలో కొంత కాలం సందిగ్ధం నెలకొంది. తెలంగాణ నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు వేచిచూడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. తెలంగాణ ముందుకు రాకపోవడంతో... జీవో జారీ చేయని ఏపీ ప్రభుత్వం...  గెజిట్ అమలుకు సుముఖంగా ఉన్నా.. తెలంగాణ వైఖరి తో వేచి చూస్తుంది. బోర్డు పరిధిలోకి విద్యుత్ ప్రాజెక్టులు తప్పనిసరి తీసుకోవాల్సిందేనని ఏపీ అంటుంది. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర జలశక్తి దృష్టికి బోర్డులు తీసుకుని వెళ్ళాయి.  బోర్డుల గెజిట్ అమలు అంశం మరోసారి కేంద్రం పరిధిలోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap ts

సంబంధిత వార్తలు: