జ‌గ‌న్ భ‌క్తుడికి స‌జ్జ‌ల క్లాస్?

RATNA KISHORE

రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్ర స‌మ‌స్య‌లు చ‌వి చూస్తోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ లో ఆ రోజు మ‌ద్ద‌తు ఇచ్చిన ఉద్యోగులే ఇవాళ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. ఇదే మాత్రం స‌హించ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉద్యోగ సంఘాల‌ను పిలిచి మ‌రీ! వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు. గ‌తంలో మాదిరిగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌కాలంలో జీతాలు చెల్లించ‌డం లేద‌న్న ఆరోప‌ణ ఒక‌టి వినిపిస్తోంది. పింఛ‌న్ల‌కూ గ‌డ్డు కాల‌మే ఎదురౌతుంద‌న్న‌ది వారి ఆవేద‌న‌. ఈ ద‌శ‌లో ప్ర‌భుత్వం కాస్త దిగి వ‌చ్చి పీఆర్సీ విష‌య‌మై క్లియ‌రెన్స్ ఇచ్చిన‌ప్ప‌టికీ ఇంకా మిగిలి ఉన్న స‌మ‌స్య‌లు ఎప్పుడు ప‌రిష్కరిస్తార‌న్న వాద‌న ఒక‌టి ఉద్యోగ వ‌ర్గాల నుంచి బ‌లీయంగా విన‌వ‌స్తోంది. దీంతో రెండు వ‌ర్గాల మ‌ధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోంది.

దీనిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చర్య‌లు పెద్ద‌గా ఫ‌లించ‌డం లేదు. స‌రైన ఆర్థిక మూలాలు లేని కార‌ణంగా ప్ర‌భుత్వం చెప్పే మాట‌లు న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌ని ఉద్యోగ వ‌ర్గాలు వాపోతున్నాయి.

పీఆర్సీ విష‌య‌మై ప‌ట్టుబ‌డుతున్న ఉద్యోగులు రానున్న ప‌రిణామాల‌పై మ‌రింత ఆసక్తి పెంచుకుంటున్నారు. మ‌రోవైపు ఉద్యోగుల పంతాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం సీరియ‌స్ గానే ఉంది. ఆర్థిక కార‌ణాలు అన్నీ తెలిసి కూడా త‌మ‌ను ఇర‌కాటంలో పెడుతున్నార న్నది జ‌గ‌న్ ఆరోప‌ణ. ఇదే కాదు ఉద్యోగుల‌ను తాను వేరుగా చూడ‌డం లేద‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. కానీ వాస్త‌విక స్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఉద్యోగుల‌కూ, ప్ర‌భుత్వానికీ మ‌ధ్య గ్యాప్ ఉన్న‌ప్ప‌టికీ అది పైకి క‌నిపించ‌డం లేదు.


జ‌గ‌న్ భ‌క్తుడిగా పేరున్న బండి శ్రీ‌నివాస‌రావుకు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి క్లాస్ ఇచ్చారు. పీఆర్సీ మొద‌లు కుని వివిధ స‌మ‌స్య‌ల‌పై పోరాటం సాగిస్తున్న ఉద్యోగులను తాము వేరుగా చూడ‌మ‌ని, అలా విభ‌జించే దురుద్దేశాలు ఏమీ లేవ‌ని చెప్పారు స‌జ్జ‌ల. అదేవిధంగా ఉద్యోగ సంఘ నాయ‌కుల‌తో తాను ఫోన్లో మాట్లాడిన విష‌యం వైర‌ల్ అయిన సంగ‌తిపై కూడా స‌జ్జ‌ల స్పందించారు. ప్రెస్మీట్ లో ఉంటే ప‌క్క‌కు వెళ్లి మాట్లాడ‌లేరా అని క్లాస్ ఇచ్చారు. ఇప్పుడిదే ఉద్యోగ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: