ఉపరాష్ట్రపతి అరుణాచలప్రదేశ్ యాత్రపై.. చైనా నిరసన.. !

Chandrasekhar Reddy
చైనా ఇంకా అరుణాచలప్రదేశ్ తమదే అనుకుంటుంది. అందుకే ఇటీవల ఆ రాష్ట్రాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. దీనిని చైనా రెచ్చగొట్టే చర్య అంటూ నిరసన వ్యక్తం చేసింది. కారణం ఇప్పటికి టిబెట్ ను అనుకుని ఉన్న అరుణాచలప్రదేశ్ ను కూడా దానిదే అని అప్పుడప్పుడు రంకెలు వేయడం చైనా కు మాములే. ఈ నేపథ్యంలోనే భారత ఉపరాష్ట్రపతి పర్యటనపై స్పందించింది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆ దేశానికి సహజమే. ఎక్కడ ఆ దేశం కన్ను పడితే అది తనదే అనుకుంటూ ఉన్న చైనా ఇంకా ప్రపంచంలో నియంత పాలన ఉందని అనుకుంటూ భ్రమలో బ్రతికేస్తుంది. అందుకే తాను కావాలి అనుకున్నవన్నీ పాపం మిగిలిన వారు ఇచ్చేస్తారు అనుకుంటూ ఉంటుంది.
భారత్ ఎప్పటి నుండో చైనా తో ఈ తరహా సరిహద్దు సమస్యలతో వేగుతూనే ఉంది. అయితే ఈసారి అది శృతిమించినట్టే ఉంది. ఏకంగా ఉపరాష్ట్రపతి పర్యటనపై చైనా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. భారత్ తన రాష్ట్రంలో తాను పర్యటించినా చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నే అక్కడ ఉన్న నియంత మానసిక స్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచాన్ని ఏలడం ఆయన కల అయిఉండవచ్చు కానీ దానిని దారి మాత్రం ఇది కాదు. సరిగ్గా మాట్లాడితే ఒక్కసారి చైనా వాసులే స్వాతంత్రం కావాలని తిరగబడితే తగ్గుకునే శక్తి అక్కడ ప్రభుత్వానికి లేదు, అలాంటి నియంత నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అనుకుంటూ వదిలేయడమే ఉత్తమం అంటున్నారు విశ్లేషకులు.
దీనిపై స్పందించిన భారత్ కూడా ఇదే తరహాలో స్పందించింది. ఏ భూభాగంపై తమరి కన్ను పడితే అది తమకు సమర్పించుకోవడానికి ఇక్కడ తమ బానిసలు ఎవరు లేరు, నీ భూభాగంలోకి నాకు రావాల్సిన అవసరం లేదు, నీదేశాన్ని ముందు సరిగ్గా చూసుకో అనే స్థాయిలో భారత్ స్పందించింది. పాక్ కూడా కాశ్మీర్ పై కన్ను వేసిందని దానిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాం తప్ప అక్కడ పాక్ ఎందుకు లేదు, దానికి తెలుసు దానిని ఆ దేశం ఆక్రమించింది అని, అందుకే అక్కడ ఉండటం లేదు. నీలాగా కనిపించినదంతా మాదే అనే అవసరం మాకు లేదు అంటూ భారత్ ఘాటుగానే స్పందించింది. ఒకవేళ నీదే అయితే నువ్వెందుకు అక్కడ లేవు, భారత్ చేతిలో మట్టి కరిసి పారిపోయావా అంటూ భారత్ స్పందించింది. అరుణాచలప్రదేశ్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగం. ఇలా మీ ఇష్టానుసారంగా ఎదుటివారి భూభాగాలపై ఆరోపణలు చేయడం మానుకోవాలని భారత్ స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: