నాని-వంశీలకు ‘కమ్మ’ని సపోర్ట్ ఎక్కువే...

M N Amaleswara rao
టి‌డి‌పిలో రాజకీయ జీవితం మొదలుపెట్టి....అదే టి‌డి‌పికి చుక్కలు చూపిస్తున్న నాయకుల్లో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఈ ఇద్దరి రాజకీయ జీవితాలు టి‌డి‌పిలోనే మొదలయ్యాయి..పైగా ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే. టి‌డి‌పిలో ఉండగా కొడాలి నాని-వల్లభనేని వంశీలు మంచి విజయాలే అందుకున్నారు. 2004లో కొడాలి నాని ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. టి‌డి‌పిలోకి వచ్చి గుడివాడ బరిలో దిగారు...అప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్ హవా ఉన్నా సరే గుడివాడలో నాని గెలిచారు. ఇదే సీన్ 2009 ఎన్నికల్లో రిపీట్ అయింది. మళ్ళీ కొడాలి టి‌డి‌పి తరుపున గెలిచేశారు.
కానీ టి‌డి‌పిలో ఉన్న దేవినేని ఉమా ఆధిపత్య పోరు వల్ల నాని బయటకొచ్చేశారు...జగన్ పెట్టిన వైసీపీలో చేరిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించేశారు. ఇప్పుడు మంత్రిగా దూసుకెళుతున్నారు. పైగా నాని వచ్చేశాక గుడివాడలో టి‌డి‌పి పుంజుకోలేకపోతుంది. అయితే టి‌డి‌పి పుంజుకోకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కమ్మ వర్గం...ఆ వర్గం వారు టి‌డి‌పికే ఎక్కువ మద్ధతు ఉంటారనే విషయం తెలిసిందే.
అయితే గుడివాడలో కమ్మ వర్గంలో చాలామంది నానికి సపోర్ట్ ఇస్తున్నారు. మిగిలిన కులాల మద్ధతు ఎలాగో నానికే ఉంది. కానీ కమ్మ వర్గం కూడా నాని వైపే ఉంది. అందుకే నానికి గుడివాడలో తిరుగులేకుండా పోయింది. అటు గన్నవరంలో అదే పరిస్తితి రిపీట్ అవుతుంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వంశీ...టి‌డి‌పి తరుపున గన్నవరం బరిలో విజయం సాధించారు.


కానీ అనూహ్యంగా వైసీపీ వైపుకు వచ్చేశారు. పార్టీ మారినా సరే గన్నవరంలో వంశీకి ఫాలోయింగ్ తగ్గలేదు. అయితే గన్నవరంలో ఉన్న కమ్మ వర్గం వంశీకి దూరమవుతుందని అంతా అనుకున్నారు. కాకపోతే అలా జరగలేదు. వంశీకే వారు ఇంకా మద్ధతుగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఇప్పటికీ గన్నవరంలో టి‌డి‌పి పుంజుకోలేకపోతుంది. మొత్తానికైతే కమ్మ వర్గం సైలెంట్‌గా నాని-వంశీలకు సపోర్ట్ గా ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: