ఏలూరులో సైకిల్ బాగానే సెట్ అవుతుందిగా!

M N Amaleswara rao
ఏలూరు పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో వైసీపీ సత్తా చాటింది. ఇక్కడ వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. ఏలూరు పార్లమెంట్ స్థానంతో పాటు ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరింది. అయితే ఈ రెండున్నర ఏళ్లలో అనేక మార్పులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి....కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబర్చకపోవడం, అటు టి‌డి‌పి నేతలు పుంజుకోవడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయం మారింది.
పైగా ఏలూరు పార్లమెంట్ టి‌డి‌పి అధ్యక్షుడుగా గన్నీ వీరాంజనేయులు దూకుడుగా పనిచేస్తున్నారు....అసెంబ్లీ స్థానాల్లో టి‌డి‌పి నేతలని సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అలాగే గన్నీ...తన సొంత నియోజకవర్గం ఉంగుటూరులో బాగానే పికప్ అయినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో గన్నీ భారీ మెజారిటీ తేడాతో ఉంగుటూరులో ఓడిపోయారు. ఓడిపోయినా సరే గన్నీ పార్టీ కోసం నిలబడుతూ వచ్చారు. కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ పార్టీని చాలా వరకు బలోపేతం చేశారు. ఇంకో రెండేళ్ళు కూడా కష్టపడితే ఉంగుటూరులో టి‌డి‌పి సెట్ అయిపోతుంది.


ఇక దెందులూరులో ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ చాలా వేగంగా పుంజుకున్నారు. అసలు తక్కువ సమయంలోనే ఓటమి నుంచి బయటపడి పికప్ అయ్యారు. నెక్స్ట్ ఎన్నికల్లో దెందులూరులో చింతమనేనికి తిరుగులేదని తెలుస్తోంది. అటు ఏలూరులో టి‌డి‌పి నేత బడేటి బుజ్జి చనిపోవడంతో, ఆయన స్థానంలో బడేటి చంటి వచ్చారు. చంటి కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. ఏలూరులో పార్టీని బాగానే పికప్ చేసుకున్నారు.
నూజివీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావు కాస్త యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. ఇంకా యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరముంది. కైకలూరులో జయమంగళ వెంకటరమణ పికప్ అవ్వాల్సిన అవసరముంది. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో టి‌డి‌పి ఇంకా వీక్ గానే ఉంది. అయితే నెక్స్ట్ జనసేనతో గానీ పొత్తు పెట్టుకుంటే ఏలూరులో టి‌డి‌పికి తిరుగుండదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: