రేవంత్ పాదయాత్ర డేట్ ఫిక్స్...?

Gullapally Rajesh
ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుంది ఏంటనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత కూడా లేదు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా చేసే సూచనలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానం తీరుపై చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి కచ్చితంగా తెలంగాణలో పూర్తిస్థాయిలో బలోపేతం కావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. హుజురాబాద్ ఎన్నికల మీద రేవంత్ రెడ్డి పెద్దగా దృష్టి పెట్టక పోయినా హుజురాబాద్ ఎన్నికల తర్వాత మాత్రం ఆయన పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిఫై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. దాదాపుగా రేవంత్ రెడ్డి 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి అని వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.
దీనికి సంబంధించి దసరా తర్వాత పార్టీ నాయకులు సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయని అంటున్నారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పాదయాత్ర కు సంబంధించి తేదీని ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పార్టీని బలోపేతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. అలాగే పార్టీలో కొంతమంది కీలక నాయకులు కూడా దారిలోకి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. దీనికి సంబంధించి ఏం జరగబోతోంది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది చూడాలి. మరి ఆయన ఆలోచన ఏ విధంగా ఉంది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: