హుజురాబాద్‌ : క‌మ్యూనిస్టుల సాయం కోరుతున్న టీఆర్ఎస్..?

Paloji Vinay
తెలంగాణ రాజ‌కీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. బీజేపీ త‌ర‌ఫున ఈటల రాజేంద‌ర్ బ‌రిలో ఉండ‌గా అధికార టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి విద్యార్థి నేత బ‌ల్మూరి వెంక‌ట‌న‌ర్సింగ‌రావు పోటీలో ఉన్నారు. అయితే, హుజురాబాద్ నియోజ‌క వ‌ర్గంలో ఉప ఎన్నిక పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య‌నే ఉండ‌నుంద‌ని క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ల ప్ర‌చారంలో వేగం పెంచారు. దీంతో హుజురాబాద్ పోరు మ‌రింత హీటెక్కింది.

ఈ నేప‌థ్యంలో బీజేపీ నుంచి బ‌రిలో ఉన్న మాజి మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు చెక్ పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు ర‌చిస్తోంది. ఇందులో భాగంగానే వామ‌ప‌క్ష పార్టీల‌యిన సీపీఐ, సీపీఎం పార్టీల మ‌ద్ధ‌తు తీసుకుంటున్న‌ట్టుగా స‌మాచారం అందుతోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై జాతీయ నాయ‌క‌త్వంపై చ‌ర్చ‌లు జ‌రిపాయి రాష్ట్రంలోని లెఫ్ట్ పార్టీలు. మ‌రో రెండు రోజుల్లో దీనిపై స్ప‌ష్ట‌త ఇవ్వనున్నాయి ఈ రెండు పార్టీలు. వామ ప‌క్షాల‌కు ఏజెన్సీ ప్రాంతంలో కొంత ప‌ట్టు ఉంటుంది.

 2014 ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ‌లో క‌మ్యూనిస్టులు బాగానే ఓట్లు తెచ్చుకున్నారు. కానీ, 2018లో కాంగ్రెస్‌, టీడీపీల‌తో పొత్తు పెట్టుకోవ‌డంతో ప‌త్తా లేకుండా పోయాయి. దీంతో తెలంగాణ‌లోనూ క‌మ్యూనిస్టుల బ‌లం త‌గ్గిపోయింద‌ని అర్త‌మ‌వుతోంది. అయితే, జాతీయ పార్టీలుగా ఉండ‌డంతో ఆ పార్టీలు మ‌నుగ‌డ‌లో ఉన్నాయి. అలాగే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పెద్ద‌గా పోరాటం చేయ‌డం లేదు. గ‌తంలో లాగా క‌మ్యూనిస్టుల పోరాటాల‌కు ఇప్పుడు పెద్ద‌గా ఆద‌ర‌ణ లేకుండా పోయింది.

 అస‌లు వాళ్ల పోరాటాల‌ను ప్ర‌భుత్వాలు కాదు క‌దా ప్ర‌జ‌లు కూడా ప‌ట్టించుకోని ప‌రిస్తితి ఏర్ప‌డింది.  ఇలాంటి ప‌రిస్థితిలో హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించాల‌ని ఫిక్స్ అయ్యాయి.  హుజురాబాద్ ఎన్నిక‌ల్లో బీజేపీనే ఓడించ‌డ‌మే ప్ర‌ధాన క‌ర్త‌వ్యం అని సీపీఐ (ఎం) రాష్ట్ర ప్ర‌ధాన  కార్య‌ద‌ర్వి త‌మ్మినేని వీర‌భ‌ద్రం ప్ర‌క‌ట‌న కూడా చేశారు.  అలాగే టీఆర్ఎస్‌కు మ‌ద్ధ‌తుగా ఉండ‌నున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. హుజురాబాద్‌లో ఈట‌ల‌ను ఓడించ‌డానికి సిద్ధం అయ్యాయి. అయితే, ఈట‌ల‌ను ఓడించే స‌త్తా క‌మ్యూనిస్టుల‌కు లేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: