మహాగౌరీ అంకితమిచ్చిన రోజే దుర్గాష్ట‌మి

N ANJANEYULU
పూర్వ‌కాలంలో దుర్గం అనే రాక్ష‌సుడుండేవాడు. అత‌డు విశ్వాన్ని పూర్తిగా విధ్వంసం సృష్టించేంత‌టివాడు. దేవ‌త‌లు సైతం అత‌న్ని ఓడించే వారు కాదు. అత‌ని దారుణాలను భ‌రించ‌లేక శివుని సాయం కోసం కైలాసం వెళ్లారు. కానీ ఆ దుర్గం మ‌నుషుల చేతిలో మ‌ర‌ణం లేని వ‌రాన్ని పొందాడు. బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రులు త‌మ బ‌లాల‌తో శ‌క్తిని సృష్టించారు. దీంతో ఆమె అవ‌త‌రించి.. శాంతిని నెల‌కొల్ప‌డానికి ఆమె ఆ రాక్ష‌సుడిని సంహ‌రించింది.  ఆమెనే దుర్గామాత‌గా అవ‌త‌రించింది.
ప్ర‌తియేటా ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు జ‌రుపుకుంటారు. న‌వ‌రాత్రుల్లో దుర్గాష్ట‌మి మ‌హాస్నానంతో మొద‌ల‌వుతుంది. ప‌విత్ర వేడుక‌ల‌కు ముందు శ‌రీరాన్ని, అప‌విత్ర‌మైన‌టువంటి ఆలోచ‌న‌ల‌ను తొలిగించ‌డానికి మ‌హాస్నానంచేస్తారు. భార‌త‌దేశంలో దుర్గాష్ట‌మి అత్యంత ముఖ్య‌మైన రోజుగా భావిస్తారు. అష్ట‌మి అన‌గా ఎనిమిది. మ‌హాగౌరీకి అంకితం ఇచ్చిన రోజు మ‌రియు దుర్గామాత ఎనిమిద‌వ అవ‌తారం. తెలుగు రాష్ట్రాల‌లో దుర్గాష్ట‌మిని అష్ట‌మి రోజు జ‌రుపుకుంటారు. కానీ ప‌శ్చిమ‌బెంగాల్‌లో మాత్రం ష‌ష్టి నుంచి ప్రారంభిస్తారు. ఆరు రోజుల పాటు ఈ వేడుక‌లు జ‌రుపుకుంటారు. దుర్గాష్ట‌మిని మ‌హాష్ట‌మి అని కూడా పిలుస్తారు.
దుర్గాష్ట‌మి రోజు మ‌హాశ‌క్తి చాముండి అవ‌తారంను పూజిస్తారు. చాముండి ఈరోజు మ‌హిషాసూరుడి రాక్ష‌సుని స‌హ‌చ‌రులైన చండా, ముండా, ర‌క్త‌బీజాల‌ను అంతం చేస్తుంట‌దని న‌మ్మతుంటారు.  చిన్నారులను దేవ‌త రూపంలో త‌యారు చేసి వారిని పూజ‌లు చేస్తారు. పంచాంగం ప్ర‌కారం అష్ట‌మి చివ‌రి 24 నిమిషాలు, న‌వ‌మి ప్రారంభ 24 నిమిషాలలో పూజ‌లు చేస్తే విశేషమైన లాభాలు ఉంటాయ‌ని పండితులు పేర్కొంటుంటారు. ఇలా చేయ‌డాన్ని సంధీ అని పిలుస్తారు.  పూర్వ‌కాలంలో దుర్గాష్ట‌మి రోజు జంతుబ‌లి ఆచారం కూడా ఉండేది.  దీనిని ఇప్పుడు నిషేదించారు. ప్ర‌స్తుతం పూజ‌ల‌తో పాటు గుమ్మ‌డికాయ కొడ‌తారు. అర‌టిపండ్ల‌ను పూజ‌లో వాడుతారు. హార‌తి టైంలో 108 మ‌ట్టి దీపాల‌ను వెలిగించి అమ్మ‌వారిని ప్ర‌స‌న్న చేసుకుంటారు. ఇది ఆ నాటి కాలం నుంచి వ‌స్తున్న ఆచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: