'ఆ ఇద్దరికీ' లాగుల్లో తొండలు విడిచి కొడతామన్న రేవంత్ రెడ్డి..?

Chakravarthi Kalyan
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అమిస్తాపూర్ జంగ్ సైరన్ సభలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా ప్రజల కష్టాలను ఏకరువు పెట్టారు. ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే  సురవరం ప్రతాప రెడ్డి, బూర్గుల రామకృష్ణ రావు, మల్లు ఆనంత రాములు, మల్లికార్జున్ గౌడ్, జైపాల్ రెడ్డి లాంటి  మహనీయులు గుర్తొచ్చేవారి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి గువ్వలోడు, గుడ్లగూబలోడు ఎమ్మెల్యేలుగా  ఉన్నారని.. భూ కబ్జాదారులు, ఇసుక దందాలు చేసేటోళ్లు పాలమూరు  పరువు తీస్తున్నారని రేవంత్ రెడ్డి ఘాటు పదజాలం వాడారు.

మేం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ను పండపెట్టి తొక్కుతామన్న రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్  కార్యకర్తలను వేధిస్తే గువ్వలకు, గబ్బిలాలకు లాగుల్లో తొండలు విడిచి కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. 2009 లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతానని భయంతో మహబూబ్ నగర్‌లో పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు గెలిపించి పార్లమెంట్ కు పంపిండ్రన్న రేవంత్ రెడ్డి.. ఇక్కడ  నుంచి గెలిశాక  తెలంగాణ పునర్నిర్మాణం పాలమూరు నుంచే మొదలు పెడ్తానన్నాడని గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో  బంజారా హిల్స్ లో తన ఇల్లు అమ్మి ఇక్కడ నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తానన్న కేసీఆర్.. కానీ ఇప్పుడు పాలమూరులో సాగునీటి దోపిడీ జరుగుతుందన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని.. ఇక్కడ పరిశ్రమలు రావడంలేదని పాలమూరు పిల్లలకు ఉద్యోగాలు  లేవని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు పిల్లలు ఇంకా వలసలు పోవాల్సిందేనా.. బొంబాయిలో కంపెనీలలో పనిచేయాల్సిందేనానని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. తమ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే వరకు బడిత పూజ చేస్తామన్నారు.

కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ తెలంగాణ రాగానే పూర్తి చేసి ఉంటే ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్లు అవి అక్రమ ప్రాజెక్టులు అనే వారు కాదన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి నేను అధ్యక్షున్ని అయినా నేను పాలమూరు బిడ్డనేనన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులను గుర్తు పెట్టుకుంటామన్నారు రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: